ఒంటి మీద మచ్చ చూసి.. చిరు మెగాస్టార్ అవుతాడని చెప్పిన డైరెక్టర్!

0
27

తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి మకుఠం లేని మహారాజుగా వెలుగొందారు. దాదాపు మూడు దశాబ్దాలపాటు సినీ ఇండస్ట్రీని ఏక ఛత్రాధిపత్యంగా పాలించారు. ఆయన రాజకీయాల్లోకి వెళ్లి పదేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ.. ఆ స్థానం అలాగే ఉంది. తిరిగొచ్చిన తర్వాత రూలింగ్ స్టార్ట్ అయ్యిందంటూ కింగ్ నాగార్జున లాంటి వాళ్లు అనడమే ఆయన స్టామినాకు నిదర్శనం.

అద్భుతం జరుగుతున్నప్పుడు ఎవ్వరూ గుర్తించలేరు. జరిగిన తర్వాత ఎవ్వరూ గుర్తించాల్సిన అవసరం లేదు అంటాడు త్రివిక్రమ్. అయితే.. చిరంజీవి మెగాస్టార్ గా మారబోయే అద్భుతాన్ని ముందే గుర్తించాడట ఓ దర్శకుడు. ఎవరి అండా లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన చిరు.. స్వయం కృషితో అంచెలంచెలుగా నెంబర్ వన్ స్థానానికి చేరుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే.. చిరంజీవి సాధారణ హీరోగా ఉన్నప్పుడే.. ఎన్టీఆర్ స్థాయికి చేరతావని అన్నారట సదరు దర్శకుడు!

ఆయన ఎవరంటే.. కేఎస్ఆర్ దాస్. చిరంజీవి మోహన్ బాబు కలిసి నటించిన ‘బిల్లా రంగా’ చిత్ర దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ సారి చిరంజీవి షర్ట్ ఛేంజ్ చేసుకుంటున్నారట. అప్పుడు అనుకోకుండా అటువైపు చూశాడట దాస్. ఆ సమయంలో చిరంజీవి వీపు మీద పెద్ద పుట్టుమచ్చ ఒకటి కనిపించిందట.

ఇది చూసిన ఆయన.. నీకు కూడా ఎన్టీఆర్ లాగ మచ్చ ఉంది. నువ్వు కూడా ఆయన స్థాయికి చేరుకుంటావు అని అన్నారట. ఆ డైరెక్టర్ అన్నట్టుగానే.. ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ హీరోగా వెలుగొందారు మెగాస్టార్. టాలీవుడ్ బిగ్ బాస్ అయ్యారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here