ఒంటిపై నూలు పోగు లేకుండా హీరోయిన్ బాడీ పెయింటింగ్… తండ్రితో పూజా భట్ లిప్ లాక్.. లేటేస్ట్గా వైరల్

0
9

మహేష్ భట్ ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా ప్రవేశించిన పూజాభట్ తనదైన మార్కును చాటుకొన్నారు. అయితే కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఆమె సినిమా పరిశ్రమ నుంచి అనూహ్యంగా దూరమయ్యారు. ఆమె వ్యక్తిగత జీవితం వివాదాలకు, సంచలనాలకు కేంద్ర బిందువైంది. అయితే తాజాగా ఇటీవల పూజా భట్ మరోసారి మీడియాలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారారు. ఎన్నో ఏళ్ల క్రితం సినీ పరిశ్రమకు దూరమైన ఆమె తాజాగా మళ్లీ ఇంటర్నెట్‌ మీడియాలో పతాక శీర్షికలను ఎందుకు ఆకర్షించారంటే…

మహేష్ భట్ కూతురిగా

ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ మొదటి భార్య కూతురుగా పూజా భట్ సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలు. డాడీ చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ఆ తర్వాత దిల్ హై కీ మాంతా నహీ, సడక్ చిత్రాలు వరుస హిట్లు సాధించడంతో టాప్ హీరోయిన్ రేసులో పడిపోయారు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ 35కిపైగా చిత్రాల్లో నటించారు.

తండ్రితో లిప్‌లాక్

సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే సంప్రదాయ పద్దతులకు వ్యతిరేకంగా వ్యవహరించే వారు. ప్రపంచం ఏమనుకొంటుందనే విషయాన్ని పక్కన పెట్టి బోల్డుగా వ్యవహరించే వారు. తండ్రి మహేష్ భట్‌తో లిప్‌లాక్ చేస్తూ ప్రముఖ మ్యాగజైన్‌ కవర్ పేజ్‌ కోసం ఫోటోషూట్ చేయడం అత్యంత వివాదమైంది.

నగ్నంగా బాడీ పెయింటింగ్

ఇక అంతటితో ఆగకుండా నగ్నంగా మారి తన శారీరాన్ని పెయింటింగ్ చేసుకొని మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. ఒంటిపై నూలు పోగు లేకుండా దుస్తులు తొడిగినట్టు పెయింట్ చేయించుకొన్నారు. ఎవరైనా చూస్తూ డిజైనర్ దుస్తుల్లో ఉన్నారా అనేంతంగా సరికొత్తగా పెయింట్ చేయించుకొన్నది. సోషల్ మీడియా లేని కాలంలో ఆమె ఫోటోలు మీడియాలో వైరల్‌గా మారాయి.

మద్యానికి బానిసైన హీరోయిన్

టాప్ హీరోయిన్‌గా ముద్ర పడిన నేపథ్యంలో పూజా భట్ జీవితం ఒక్కసారిగా కదుపుకు లోనైంది. భర్తతో విడాకులు తీసుకోవడం, జీవితంలో మరి కొన్ని సంఘటనలు చోటుచేసుకోవడంతో మద్యానికి బానిసైంది. చాలా రోజులు మత్తులో మునుగుతూ బాహ్య ప్రపంచానికి దూరమైంది. అయితే తాగుడుకు దూరం కావాలని కొద్ది సంవత్సరాల క్రితం అనూహ్యంగా నిర్ణయం తీసుకోవడంతో మళ్లీ మామూలు మనిషిగా మారింది.

సడక్ 2 సీక్వెల్‌తో రీ ఎంట్రీ

మద్యం మత్తు నుంచి బయటపడిన తర్వాత పూజా భట్ తనకు భారీ హిట్ అందించిన సడక్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన సడక్2 చిత్రంలో నటించింది. లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో ఆగస్టు 28, 2020న డిస్నీ+హాట్‌స్టార్‌లో సడక్ 2 రిలీజై దారుణమైన పరాజయాన్ని పొందింది. ఇటీవల నెట్ ఫ్లిక్స్‌లో రిలీజైన బాంబే బేగం వెబ్ సిరీస్‌ ద్వారా మరోసారి ప్రేక్షకులకు చేరువైంది.

అమీర్ ఖాన్‌తో మూవీకి 30 ఏళ్లు

ఇక తాజాగా పూజా భట్ వార్తలో నిలువడానికి కారణం ఆమె నటించిన దిల్ హై కీ మాంతా నహీ అనే చిత్రం 30 ఏళ్లు పూర్తి చేసుకొన్నది. అమీర్ ఖాన్‌తో కలిసి నటించిన ప్రేమ కథా చిత్రం జూలై 12వ తేదీన రిలీజై సంచలన విజయం సాధించింది. దాంతో ఆమె న్యూడ్ ఫోటోలు మీడియాలో వైరల్‌గా మారాయి.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here