ఎవరెస్టుపై వకీల్ సాబ్ మేనియా!

0
12

హిట్టు.. ఫ్లాపులతో సంబంధం లేకుండా పెరిగిపోయే ఫ్యాన్ ఫాలోయింగ్ కేవలం పవన్ కు మాత్రమే సొంతం అనడం అతిశయోక్తి కాదేమో! పవన్ కల్యాణ్ 25 సినిమాల్లో.. దాదాపు సగం వరకూ ఫ్లాపులు ఉన్నాయి. అయినప్పటికీ.. ప్రతీ సినిమాకు ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందే తప్ప తగ్గలేదు. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఏమైనా తేడా వచ్చిందేమో అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ.. రిలీజ్ కు ముందే వకీల్ సాబ్ సృష్టిస్తున్న ప్రభంజనం ఆ అనుమాలన్నీ పటాపంచలు చేస్తోంది.

మూడేళ్ల నుంచి పవన్ ఫ్యాన్స్ ఎంత ఆకలితో ఉన్నారో ట్రైలర్ చెప్పకనే చెప్పింది. రిలీజ్ అయిన 24 గంటల్లోనే 18 మినిలియన్లకు పైగా వ్యూస్ 1మిలియన్ లైక్స్ సాధించింది. ఈ దూకుడు ముందు నిలవలేక ఎన్నో రికార్డులు ధ్వంసమయ్యాయి. ఇక సినిమా రిలీజ్ కు కేవలం రెండు రోజుల గడువు మాత్రమే ఉండడంతో ఫ్యాన్స్ ఆరాటానికి అంతులేకుండా పోతోంది.

వకీల్ సాబ్ మేనియాను క్యాష్ చేసుకునేందుకు నిర్మాతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రెండు రాష్ట్రాల్లోని దాదాపుగా 90 శాతం థియేటర్లలో వకీల్ సాబ్ బొమ్మ పడబోతోంది. ‘వైల్డ్ డాగ్’తో ముందస్తు ఒప్పందం ప్రకారం వారం వరకే థియేటర్లను రిజర్వు చేశారట. దీంతో.. ఇప్పుడు అవి కూడా వకీల్ సాబ్ ఆధ్వర్యంలోకి రాబోతున్నాయి.

ఇక తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్  ఓపెన్ చేసిన నెక్స్ట్ మూమెంట్ నుంచే టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోవడం మొదలయ్యాయి. హైదరాబాద్ లో 96 శాతం థియేటర్లలో ఏకంగా 400 వందల షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేయగా.. బుకింగ్స్ ఓపెన్ చేసిన గంటల్లోనే టికెట్లన్నీ అయిపోయాయి.  మిగిలిన ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

మొత్తానికి ఏప్రిల్ 9న తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని థియేటర్లలో కేవలం వకీల్ సాబ్ బొమ్మ మాత్రమే ఆడబోతుండడం విశేషం. ఇప్పటి వరకూ ఏ సినిమాకు కూడా ఇలా జరగలేదని అంటున్నారు. రిలీజ్ కు ముందే ఇలా ఉంటే.. రిలీజ్ తర్వాత పరిస్థితి ఏంటన్నది అంతుపట్టకుండా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here