ఎరక్కపోయి ఇరుకున్న తమన్.. వివాదంలోకి మంగ్లీని లాగుతూ రచ్చ, వదిలేదు లేదంటూ!

0
22

ఈ మధ్య కాలంలో మతాల పేరుతో వివాదాస్పదమైన సినిమాలు తక్కువగా వస్తున్నాయి అని చెప్పాలి. కానీ ఇప్పుడు వరుసగా వివాదంలో చిక్కుకున్న సినిమాల సంఖ్య పెరుగుతోంది.. తాజాగా ఇలా వివాదంలో చిక్కబోతున్న సినిమాల లిస్టు లో నాగశౌర్య హీరోగా నటిస్తున్న వరుడు కావలెను సినిమా చేరబోతోంది. దేవుడి పాటను ఐటెం సాంగ్ మాదిరిగా పాడి మంగ్లీ మరోసారి వివాదంలోకి కూరుకుపోయింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

వరుడు కావలెను

తెలుగులో పెద్దగా సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ఊహలు గుసగుసలాడే లాంటి సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారాడు నాగశౌర్య.. చేసిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న అతను, ఏకంగా సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి సినిమాలు నిర్మించే స్థాయికి ఎదిగాడు. అలా సొంతగా ఆయన అశ్వద్ధామ అనే సినిమా చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. అందులో ఆయన హీరోగా నటిస్తున్న వరుడు కావలెను సినిమా ఒకటి. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది.

అది భజన పాట

వరుడు కావలెను సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు సినిమా యూనిట్. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ముమ్మరం చేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక లిరికల్ సాంగ్ కి సంబంధించిన ప్రోమోని కూడా విడుదల చేశారు. ఆ ప్రోమోనే ఇప్పుడు తమన్ సహా సినిమా యూనిట్ కొంపముంచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ వరుడు కావలెను సినిమాకు సంబంధించిన దిగు దిగు దిగు నాగ అంటూ మాస్ బీట్ తో సాగుతున్న ఒక సాంగ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. అయితే దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది, ఈ దిగు దిగు దిగు నాగ అనే పాట సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఒక భజన పాట. అలాంటి పాటను ఒక హీరోయిన్ కి అన్వయిస్తూ ఎలా ఐటెం సాంగ్ లా రూపొందించారు అంటూ హిందూ సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

ఐటమ్ సాంగ్ లాగా మార్చి

నాగ దేవతలు కోసం ప్రార్థన చేసే పాటని ఐటమ్ సాంగ్ లాగా మార్చిన సంగీత దర్శకుడు థమన్, రచయిత అనంత శ్రీరామ్, గాయకులు మరియు చిత్ర బృందం వెంటనే పత్రికా ముఖంగా క్షమాపణలు చెప్పాలి అంటూ హిందూ సంఘాల నుంచి ఇప్పుడు డిమాండ్స్ వినిపిస్తున్నాయి. దిగు దిగు దిగు నాగ నాగన్న దివ్యా సుందర నాగో నాగన్న అంటూ సాగుతున్న పల్లవికి తమన్ తనదైన మాస్ మసాలా బీట్ అందించాడు. అయితే సాధారణంగా తమన్ అందిస్తున్న అన్ని పాటలు కాపీ పాటలు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తుంటాయి. దానికి తగ్గట్టు ఎన్నో ఏళ్ల నుంచి భజన పాట గా పేరు తెచ్చుకున్న ఈ పాటను కూడా తమన్ ఈ సినిమా కోసం వాడే వేయడంతో దానిని కూడా కలిపి హిందూ భక్తజనం ఇప్పుడు ఆయన్ని టార్గెట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మంగ్లీని లాగి

ఇక దీనికి తోడు కొందరు మంగ్లీ ఇటీవల బోనాల పాట చేసిన వివాదం గురించి కూడా ప్రస్తావిస్తున్నారు. ఎప్పుడో రాసిన పాటను మంగ్లీ వాడుకుంటే ఆమె చేత క్షమాపణ చెప్పించే దాకా హిందూ సంఘాలు వదల్లేదని ఇప్పుడు తమన్ ని కూడా క్షమాపణలు చెబుతూ పాట మార్చే వరకు హిందూ సంఘాలు ఊరుకోమని కొందరు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే హిందువులు ఎంతో పవిత్రంగా భావించే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన భజనలు ఈ విధంగా ఒక ఐటెం సాంగ్ అది రొమాంటిక్ యాంగిల్ లో చూపించడం అసలు సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రస్తుతానికి అయితే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున వివాదం బయటకు రాకపోయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా చాలామంది అయితే పోస్టులు పెడుతున్నారు. ఖచ్చితంగా ఈ విషయంలో తమ ఇబ్బంది పడక తప్పదు అనే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇప్పుడు కాక ఇంకెప్పుడూ

సరిగ్గా రెండు రోజుల క్రితం నుంచి ఇప్పుడు కాక ఇంకెప్పుడూ నేను ట్రైలర్ విషయంలో హిందూ సంఘాలు చేయడంతో ఆ సినిమా దర్శకుడు ట్రైలర్ ని రిమూవ్ చేయడమే కాక క్షమాపణలు కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. పూర్తిగా ఏ సర్టిఫికెట్ సినిమాలు అనిపించిన ఇప్పుడు కాక ఇంకెప్పుడు ట్రైలర్లో పబ్ నేపథ్యంలో భజగోవిందం సాంగ్ ప్లే చేసినట్లు కనిపించింది. దీంతో రంగంలోకి దిగిన హిందూ సంఘాలు వెంటనే క్షమాపణ చెప్పాలని లేదంటే పరిస్థితి ఉద్రిక్తంగా మరబోతుందని హెచ్చరించడంతో ఎట్టకేలకు సదరు దర్శకుడు క్షమాపణ చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. ఈ విషయం కూడా అంతే సీరియస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here