ఎన్టీఆర్ కు ఫోన్ చేసిన మెగాస్టార్!

0
20

కరోనా మహమ్మారి సినీ పరిశ్రమపై ప్రభావం చూపిస్తూనే ఉంది. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు కొవిడ్ బారిన పడ్డారు. తాజాగా.. జూనియర్ ఎన్టీఆర్ కు సైతం కరోనా సోకింది. ఈ విషయాన్ని రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో ప్రకటించారు జూనియర్. అయితే.. తాను బాగానే ఉన్నానని ఎవ్వరూ ఆందోళన చెందొద్దని కోరారు.

తనతోపాటు తన కుటుంబం హోం ఐసోలేషన్లో ఉందని చెప్పిన జూనియర్.. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. ఇక రెండు మూడు రోజుల ముందు తనను కలిసిన వారంతా పరీక్ష చేయించుకోవాలని సూచించారు.

దీంతో.. సినీ ప్రముఖులు అభిమానులు జూనియర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. ఫ్యాన్స్ పూజలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి జూనియర్ కు ఫోన్ చేసినట్టు తెలిపారు. ఈ మేరకు చిరు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

”కాసేపటి క్రితం తారక్ తో మాట్లాడాను. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ హోం క్వారంటైన్లో ఉన్నారు. అతనితోపాటు కుటుంబ సభ్యులు కూడా బాగున్నారు. తను చాలా ఉత్సాహంగా ఎనర్జిటిక్ గా ఉన్నారని తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీలయ్యాను. త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఆశిస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ తారక్” అని ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here