ఎన్టీఆర్ కరోనా నుండి కోలుకోవాలంటూ బాబు ట్వీట్

0
24

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనకు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యిందంటూ ట్వీట్ చేసిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్ స్పీడ్ గా రికవరీ అవ్వాలంటూ ఇండస్ట్రీ వర్గాల వారు పలువురు సోషల్ మీడియా ద్వారా ఆకాంక్షిస్తూ ట్వీట్స్ చేయడం జరిగింది. ఎన్టీఆర్ కరోనా నుండి త్వరగా కోలుకుని బయట పడాలంటూ అభిమానులు సోషల్ మీడియా ద్వారా ప్రార్థనలు చేస్తున్నారు. ఈ సమయంలోనే మాజీ సీఎం.. తెలుగు దేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు కూడా ఎన్టీఆర్ ఆరోగ్యం గురించి ట్వీట్ చేశారు.

చంద్రబాబు ట్విట్టర్ లో… ఎన్టీఆర్ స్పీడ్ గా పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండు త్వరగా కోలుకో.. అంటూ ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ ట్వీట్ ను రీ ట్వీట్ చేసి చంద్రబాబు నాయుడు ఈ ట్వీట్ ను చేశారు. ఎన్టీఆర్ కు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు గెట్ వెల్ సూన్ చెప్పడంతో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కరోనా టాపిక్ ట్రెండ్డింగ్ గా నిలిచింది. నందమూరి అభిమానులు మాత్రమే కాకుండా ఇతర ఫ్యామిలీ హీరోల అభిమానులు కూడా ఎన్టీఆర్ కోలుకోవాలంటూ ట్వీట్స్ చేయడం చెప్పుకోదగ్గ విషయం.

ఎన్టీఆర్ స్వల్ప లక్షణాలతో బాధ పడుతున్నారు. దయచేసి నా గురించి ఎవరు ఆందోళన చెందవద్దంటూ ఎన్టీఆర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఎన్టీఆర్ మరియు కుటుంబ సభ్యులు మొత్తం కూడా కరోనా కారణంగా స్వీయ నిర్భందంలోకి వెళ్లి పోయారు. సినీ ప్రముఖులు పలువురు కరోనా బారిన పడుతున్న ఈ సమయంలో షూటింగ్ లు దాదాపుగా అన్ని ఆపేస్తున్నారు. ఎన్టీఆర్ కు కరోనా ఎలా వచ్చి ఉంటుంది అనే విషయం తెలియాల్సి ఉంది. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కు ఎన్టీఆర్ గ్యాప్ ఇచ్చాడు. అయినా కూడా ఆయన పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. ఇక ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఈ గ్యాప్ లో కొరటాల పూర్తి చేస్తున్నారని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here