‘ఎన్టీఆర్ ఇంట్లో నైట్ పార్టీలు చేసుకునేవాళ్ళం.. రాజమౌళితో తిట్లు తినేవాళ్ళం’

0
25

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్రెండ్ షిప్ కి ఎంతో వాల్యూ ఇస్తారని.. సినిమా విషయంలో ఎంత సీరియస్ గా ఉంటారో బయట అంతే సరదాగా ఉంటారని సినీ ప్రముఖులు చెబుతూ ఉంటారు. ఇక ఇండస్ట్రీలో తారక్ తో బాగా క్లోజ్ గా ఉండే నటులలో సమీర్ ఒకరు. అందుకే సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా జూ.ఎన్టీఆర్ చేసే అల్లరి గురించి సమీర్ కి కాస్త ఎక్కువే తెలుసు. ‘స్టూడెంట్ నెం.1’ ‘సింహాద్రి’ ‘నా అల్లుడు’ వంటి సినిమాల్లో ఎన్టీఆర్ తో కలిసి నటించిన సమీర్.. పలు సందర్భాల్లో ఆయన ఆఫ్ స్క్రీన్ లో ఎలా ఉంటాడో చెప్పారు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమీర్.. ఎన్టీఆర్ క్యారెక్టర్ గురించి ఫ్రెండ్ షిప్ గురించిన సంగతులను వెల్లడించారు.

హీరోలలో తనకు ఎన్టీఆర్ తో సాన్నిహిత్యం ఎక్కువని.. పెళ్లి కాకముందు ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి నైట్ అంతా ఫుల్ గా ఎంజాయ్ చేసేవాళ్ళమని యాక్టర్ సమీర్ తెలిపాడు. పెళ్లికి ముందు ఎన్టీఆర్ ప్రతి రోజూ షూటింగ్ అయిపోయిన వెంటనే అందరికి ఫోన్ చేసేవాడు.. అందరం వెళ్లి ఆయన ఇంట్లోనే పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేసేవారమని సమీర్ అన్నారు. తనతో పాటుగా రాజీవ్ కనకాల – శ్రీనివాస్ రెడ్డి – రాఘవ – రఘు వంటి వారిని తారక్ ఇంటికి ఆహ్వానించేవారని సమీర్ చెప్పుకొచ్చారు. అయితే పెళ్లి తరువాత పార్టీలు మానేశారని.. ఇప్పుడు ఫ్యామిలీకి ఎక్కువ సమయం ఇస్తున్నారని అన్నారు.

సినిమా షూటింగ్ సమయంలో కూడా ఎన్టీఆర్ చాలా సరదాగా ఉంటారని.. ప్రాక్టీకల్ జోక్స్ బాగా వేసేవారని చెప్పారు. షూటింగ్ స్పాట్ లో ఎవరైనా చిన్న మిస్టేక్ చేస్తే షర్ట్ విప్పి రోజంతా అలాగే కనబడాలని చెబుతూ సరదాగా ఆట పట్టించేవారని.. అయితే అవి ఎవ్వరికీ కోపం తెప్పించేదికాదని సమీర్ తెలిపారు. రాజమౌళి సినిమా షూటింగ్ టైంలో అయితే మైక్ లో అరుపులే ఉంటాయని.. ఆయనతో విపరీతంగా తిట్లు తినేవారమని చెప్పారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ లో అల్లరి తగ్గిపోయిందని.. జెంటిల్ మెన్ గా చాలా మెచ్యూర్ గా ఉన్నాడని తెలిపారు. ఎన్టీఆర్ లాంటి టాలెంటెడ్ యాక్టర్ ని ఎక్కడా చూడలేదని ఈ సందర్భంగా సమీర్ చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here