ఈ ‘స్టార్ విలన్’కు ఇండస్ట్రీలో డిమాండ్ పెరిగిపోయిందా..??

0
20

ఇండియన్ స్టార్ యాక్టర్ సోనూసూద్ అంటే ఇదివరకు ఎక్కువగా గుర్తించేవారు కాదేమో.. లేదా విలన్ రోల్స్ మాత్రమే చేస్తాడని అనుకునేవారు. కానీ ఇప్పుడు సోనూసూద్ అంటే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పరిచయం అవసరం లేదు. ఎక్కువగా విలన్ రోల్స్ పోషించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. బ్లాక్ బస్టర్ అరుంధతి సినిమాలో చేసిన పశుపతి పాత్రతో కోట్లాది ప్రేక్షకులకు సుపరిచితుడు అయ్యాడు. అయితే సినిమాల్లో విలన్ అయినప్పటికీ సోనూసూద్ నిజజీవితంలో మాత్రం నిజంగానే హీరో అనిపించుకున్నాడు. ఓవైపు కరోనా పై యుద్ధం చేస్తూ.. నిత్యం సామాన్యులకు సేవలను అందిస్తూ వైద్యసిబ్బందికి కూడా తానే సాయం చేస్తున్నాడు సోనూసూద్.

ఇప్పటివరకు కరోనా టైంలో ఎవరెన్ని సేవలు చేసినా సోనూసూద్ చేసిన సేవలు ఎవరు చేయలేరు. సోనూసూద్ సహాయం పొందినవారి వారి దృష్టిలో ఇప్పుడు దేవుడు అయిపోయాడు. దేశ ప్రజల దృష్టిలో నిజమైన హీరోగా గతేడాది కాలంగా తనకు చేతనైంది సాయం చేస్తూ ప్రతి ఒక్కరికి కాదనకుండా సేవలు అందిస్తూనే ఉన్నాడు. ఈ విషయంలో దేశం మొత్తం సోనూసూద్ ను కొనియాడుతూనే ఉంది. కానీ ఇప్పటికి సోను సేవలు చేయడంలో ఎలాంటి ఆలోచన లేకుండా ముందుంటున్నాడు. సోషల్ మీడియా ద్వారా సహాయం కోరిన వారికీ రెస్పాండ్ అవుతున్నాడు.

అయితే సేవలు చేస్తూ ప్రజల మనసు గెలుచుకున్న సోనూసూద్ క్రేజ్ రోజురోజుకి మరింత పెరిగిపోతుంది. ప్రస్తుతం సోనూసూద్ రెమ్యూనరేషన్ కూడా ఓ రేంజిలో పెరిగిందని టాక్. ఇప్పుడు సోనుతో సినిమా చేయాలంటే కోట్లలోనే పారితోషికం ఎక్సపెక్ట్ చేస్తున్నాడట. అయితే ఇప్పటికి విలన్ రోల్స్ మాత్రమే చేస్తానని అంటున్న సోనుకు తెలుగులో సినిమా చేయాలంటే నిర్మాతలు కోట్లు చెల్లించుకోవాల్సిందే అంటున్నాయి సినీవర్గాలు. అయితే హీరో క్యారెక్టర్స్ ఆఫర్స్ వస్తున్నప్పటికి సోనూసూద్ విలన్ పాత్రలకే ఓకే చెబుతుండటం గమనార్హం. ఇటీవలే అల్లుడు అదుర్స్ అనే సినిమాలో కనిపించిన సోను.. ఆ మధ్యలో తన బయోపిక్ లో తానే నటిస్తానని చెప్పాడు. మరి అదికూడా లైన్ లో పెడుతున్నాడేమో అని టాక్ నడుస్తుంది. ప్రస్తుతం సోను క్రేజ్ మాత్రం ఓ రేంజిలో ఉందనేది తెలిసిందే. సినిమాలపరంగా ఆ క్రేజ్ ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here