ఈ ప్రేమ‌క‌థ పెళ్లి వ‌ర‌కు వెళ్తుందా? లేదా ?

0
193

MAA NAYAKUDU నిజానికి నేటి కాలంలో సామాన్య యువ‌తలో కూడా ప్రేమ‌, పెళ్లి, బ్రేక‌ప్ లు పెరిగిపోయాయి. ప్రేమించిన వారితో, లేదా వివాహం చేసుకున్న వారితో చిన్న మ‌న‌స్పర్ద‌లు వ‌చ్చినా వారు క‌లిసి ఉండ‌కుండా విడిపోవ‌డ‌మే బెటర్ అని బ్రేక‌ప్స్ చెప్పుకుంటున్నారు. పెళ్ల‌యి పిల్ల‌లు ఉన్న విడాకులు తీసుకోవ‌డానికి, మ‌రొకరితో వివాహానికి సందేహించ‌డం లేదు. వారి పేరెంట్స్ కూడా పిల్ల‌ల అభీష్టాల‌కు ఎదురు చెప్ప‌డం లేదు. మ‌రికొంద‌రు స‌హ‌జీవ‌నం చేయ‌డాన్ని కూడా గొప్ప‌గా భావిస్తున్నారు. ఇక సామాన్య కుటుంబాల‌కు చెందిన యువ‌త ప‌రిస్థితే ఇలా ఉంటే స్వేచ్చా జీవితానికి, రంగుల ప్రపంచంలోని ఆక‌ర్ష‌ణ‌ల‌కు, ఆర్దికంగా కూడా ఎవ‌రిపై ఆధార‌ప‌డ‌కుండా ఫైనాన్షియ‌ల్‌గా ఏమీ ఇబ్బంది లేని సినీ జీవుల సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. సినీ న‌టుల ప్రేమ‌లు పెళ్లిళ్లు వంటివి కేవ‌లం ఓ టైం పాస్ వ్య‌వ‌హారం, చిన్న తేడా వ‌చ్చినా వేరొక‌రితో జంప్ జిలానీ అనే చెప్పాలి. దీనికి ఎంతో మందిని ఉదాహ‌ర‌ణ‌గా చెప్ప‌వ‌చ్చు. వారిది కేవ‌లం తాత్కాలిక లైంగిక ఆక‌ర్ష‌ణే అని, అంత‌కు మించిన అనుబంధాలు వారికి లేవ‌ని సామాజిక విశ్లేష‌కులు కూడా భావిస్తున్నారు. ఇక విష‌యానికి వ‌స్తే హాట్ హాట్ బ్యూటీ ఇషాగుప్తా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. బాలీవుడ్‌తో పాటు తెలుగులో స‌చినో జోషి హీరోగా న‌టించిన వీడెవ్వ‌డు, రామ్‌చ‌ర‌ణ్, బోయ‌పాటిల వినయ విధేయ రామాలో ఏక్ బార్ ఏక్ బార్ అంటూ చిందులేసిన ఈ భామ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌. వేడెక్కించే ఫొటో షూట్ల‌తో హీట్ పెంచ‌డం ఈ భామ‌కి తెలిసినంత‌గా ఎవ‌రికి తెలియ‌ద‌నే చెప్పాలి. ముఖ్యంగా బికినీ డ్ర‌స్ ల‌కు ఈమెని కేరాఫ్ అడ్ర‌స్ గా, స్పెష‌లిస్ట్‌గా చెప్పుకోవ‌చ్చు. నిరంతరం అర్ద‌న‌గ్న ఫొటోల‌తో ఈమె సోష‌ల్ మీడియాను వేడెక్కిస్తూ, త‌న అందాల ఆర‌బోత ఫొటోలతో నిరంత‌రం నెటిజ‌న్ల‌పై దండ‌యాత్ర చేసే ఈమె కుర్ర‌కారు గుండెల్లో క‌ల్లోలం రేపుతోంది. సూప‌ర్ సీనియ‌ర్ మోడ‌ల్‌గా ఇండియా లెవ‌ల్లో మిస్ దివా అందాల పోటీల‌కు జ‌డ్జి గా వ్య‌వ‌హ‌రిస్తోందంటే చిన్న విష‌యం కాదు. ఇలాంటి స్థానం గుర్తింపు, పాపులారిటీ ఈమె సొంతం. అయితే ఈమె అందాల‌కు, ఈమె అనుభ‌వానికి త‌గ్గ సినిమాలు ఇంకా ఈమెకి రావ‌డం లేద‌ని, ఎందుకనో సినీ జీవులు ఆమెని చిన్న చూపు చూస్తున్నారేమో అనిపిస్తుంది. ఐటం నెంబ‌ర్లు, బాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌ల వంటి వాటితో ఏదో ఒక‌లా కెరీర్ ని లాగుకొని వస్తోంది. ప్ర‌స్తుతం ఈమె రిజెక్ట్ ఎక్స్ 2 అనే వెబ్ సిరీస్ లో న‌టిస్తోంది. ఇందులో ఈషా పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌ట‌న‌కు ప్రాధాన్యం ఉండే పాత్ర‌తో పాటు వేడెక్కించే పోలీస్  ఆఫీస‌ర్ పాత్ర‌ను పోషిస్తోంది. సోష‌ల్ మీడియాలో ఈ వెబ్ సిరీస్ ని ఇషా వైర‌ల్‌గా ప్ర‌మోట్  చేస్తోంది. ఈ సిరీస్ ప్ర‌మోష‌న్ సంద‌ర్బంగా ఇషా త‌న బోయ్ ఫ్రెండ్ ని ప‌రిచ‌యం చేసింది. గ‌త కొంత కాలంగా విదేశీ బాయ్ ఫ్రెండ్‌తో ఇషా షికార్ చేస్తుండటం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.అత‌డి పేరు మాన్యుయేల్ కంపాస్ గువాలర్‌, ఈయ‌న స్పెయిన్ లో పెద్ద బిజినెస్ మ్య‌గ్నేట్‌. అత‌నితో క‌లిసి ఇషా దిగిన ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఇన్ స్టా స్వ‌యంగా త‌న ల‌వ‌ర్ తో ఉన్న ఫొటోని షేర్ చేసి, తానే స్వయంగా తెలిపింది. ఇక త‌న బోయ్ ఫ్రెండ్ కి ఐలవ్ యూ అంటూ త‌న‌లోని ప్రేమ విష‌యాన్ని ఇషా బ‌య‌ట‌పెట్టింది. ప్ర‌స్తుతం క‌రోనా క‌ల్లోలం వల్ల ఆమె బోయ్ ఫ్రెండ్ స్పెయిన్ లో సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నాడ‌ట‌. అత‌నితో నిత్యం వీడియో చాట్‌ల‌తో ట‌చ్ లో ఉన్నాన‌ని ఇషా గుప్తా తెలిపింది. అయితే ఈమె ప్రియాంకా చోప్రా, శ్రియా శ‌ర‌ణ్ లలాగా త‌న విదేశీ బాయ్ ఫ్రెండ్ ని వివాహం చేసుకుని స్తిర‌ప‌డుతుందా?  లేక సల్మాన్, లులియా లాగా కేవ‌లం పెళ్లి వ‌ద్దు ఎంజాయ్ మెంటే ముద్దు అంటుందా?  లేక శృతిహాస‌న్ త‌ర‌హాలో బ్రేక‌ప్ చెబుతుందా? అనేది వేచిచూడాల్సి వుంది….!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here