ఇస్మార్ట్ టీనేజర్ లుక్ తో షాకిచ్చిన శింబు

0
17

తమిళ స్టార్ హీరో శింబు కొత్త లుక్ ప్రస్తుతం సినీవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మారిన రూపంతో శింబు ఎంతో ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఒక టీనేజర్ లా ఇస్మార్ట్ గా కనిపిస్తున్నాడు.  అలా హెడ్ స్పీకర్స్ పెట్టుకుని ల్యాప్ టాప్ కి కనెక్టయ్యి మాంచి జోష్ తో ఏదో వింటున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది.

ఇంతకీ శింబు ఏం చేస్తున్నాడు? అంటే…ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతికతను అతడు పరిశీలిస్తున్నాడు. ఇటీవల ట్విట్టర్ స్పేస్.. క్లబ్ హౌస్ యాప్ లు చిత్ర పరిశ్రమ ప్రముఖులతో మమేకమైన తీరు ఆసక్తిని కలిగిస్తోంది. ఫ్యాన్స్ తో కనెక్టివిటీని పెంచుకునేందుకు స్టార్లు ఎంచుకుంటున్న ఆసక్తికర మార్గమిది. తమిళ తారలు ఇతర పరిశ్రమల స్టార్లకంటే ఈ విషయంలో ముందునున్నారు. ఇక శింబు సహా అతడి కోస్టార్లు క్లబ్ హౌస్ వంటి యాప్ లను విరివిగా వినియోగిస్తున్నారని తెలిసింది.

సినీవర్గాల్లో గ్రూప్ లు క్రియేటై ఈ వాయిస్ యాప్ లను సద్వినియోగం చేస్తున్నారు. తమిళ స్టార్ హీరో సింబు తన తదుపరి చిత్రం మానాడుపై ట్విట్టర్ స్పేస్ సెషన్ లో పాల్గొని తన అనుభవాలను పంచుకునే క్రమంలో ఫోటో ఇది. సినిమా ప్రమోషన్ల కోసం ట్విట్టర్ స్పేస్ ను కూడా సదరు హీరోలు సద్వినియోగం చేస్తున్నారు. ఇతర పరిశ్రమల స్టార్లు ఇదే విధానాన్ని అవలంభించే సమయం ఆసన్నమైందని విశ్లేషిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here