ఇలా నాకేనా.. ప్రపంచం మొత్తం ఇలాగే ఉందా?

0
13

సెలబ్రెటీలు సినిమాలు చేసినా చేయకున్నా కూడా రెగ్యులర్ గా ఏదో ఒక కార్యక్రమం లేదా పార్టీలతో బిజీ బిజీగా ఉంటారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్స్ వారంలో రెండు మూడు పార్టీలకు అయినా హాజరు అవుతూ ఉంటారని టాక్. అలాంటి స్టార్స్ ఇప్పుడు కరోనా కారణంగా ఎక్కడి వారు అక్కడే ఉంటున్నారు. ఏడాదికి పైగా బాలీవుడ్ సెలబ్రెటీల నుండి సామాన్యుల వరకు ఆ విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సెలబ్రెటీలు పార్టీలు లేక షూటింగ్ లు లేక ఇంటికే పరిమితం అయ్యి కుటుంబంతో టైం గడుపుతున్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ చేసిన పోస్ట్ తో బాలీవుడ్ సెలబ్రెటీలు ఎలాంటి మానసిక పరిస్థితులను ఎదుర్కొంటున్నారో అర్థం చేసుకోవచ్చు.

కాజోల్ ఇన్ స్టా గ్రామ్ లో ఈ ఫొటోను షేర్ చేసి ఇలా కేవలం నాకేనా.. అందరు కూడా ప్రపంచాన్ని మరో తీరున గత ఏడాది నుండి చూస్తున్నారా అంటూ కామెంట్ పెట్టింది. కాజోల్ పోస్ట్ కు చాలా మంది స్పందించారు. మీకు ప్రపంచం ఎలా కనిపిస్తుందో అందరికి కూడా అలాగే కనిపిస్తుంది అంటూ కామెంట్స్ చేశారు. మరి కొందరు మాత్రం ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులు.. ఈ సెలబ్రెటీల ఫ్యామిలీస్ బాగానే ఉన్నాయి. మీకు ఏడాది కాదు మరో ఏడాది ఇలాగే ఉన్నా వచ్చే సమస్య ఏంటంటూ కొందరు కాజోల్ పోస్ట్ ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. మొత్తానికి కాజోల్ బుంగమూతి పెట్టి తీసుకున్న ఈ ఫొటో అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు ఆమె పెట్టిన కామెంట్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here