ఇంత టార్చరా? పిస్టల్ గురిపెట్టిన బండ్ల గణేష్.. నీళ్లు తాగించిన హోస్ట్ ఓంకార్!

0
9

టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఎక్కడ ఉంటే అక్కడ హంగామా ఉంటుందనే కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆయనకు తోడు కొరియోగ్రాఫర్ ఉంటే ఇక ఆ హంగామాకు ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. తాజాగా ఇద్దరు ప్రముఖులు హోస్ట్ ఓంకార్ నిర్వహించే సిక్త్‌సెన్స్ సీజన్ 4లో పాల్గొన్నారు. ఈ షో ప్రోమోలో బాబా భాస్కర్, బండ్ల గణేష్ సృష్టించిన హల్‌చల్ ఎలా ఉందంటే..

బాబా భాస్కర్ పిస్టల్‌తో వార్నింగ్

సిక్త్‌సెన్స్‌లో కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ హంగామా సృష్టించారు. చీర్ గర్ల్‌కు తుపాకి గురిపెట్టి డ్యాన్స్ చేయి అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆ పక్కనే ఉన్న హోస్ట్ ఓంకార్ వెంటనే వచ్చి బాబా భాస్కర్‌ తలకు పిస్టల్ గురిపెట్టి షాక్ ఇచ్చారు. నీకు మా షోలో మా డ్యాన్సర్‌కు పిస్టల్ గురిపెట్టే హక్కు లేదు అంటూ ఓంకార్ వార్నింగ్ ఇచ్చారు.

నాకు గురిపెట్టండి అంటూ ఓంకార్

సిక్త్ సెన్స్ షోలో ఎవరైనా సరే నాకు పిస్టల్ తలకు గురిపెట్టే హక్కు ఉంది. అంతేగానీ నా షోలో ఉండే వాళ్లకు గురిపెడితే నేను ఊరుకొంటానా అంటూ బాబా భాస్కర్‌ను ప్రశ్నించాడు. దాంతో బాబా భాస్కర్ బెదిరిపోయాడు. అయ్యోసార్ నాకు పిస్టల్ గురిపెట్టడం ఏమిటని బాబా భాస్కర్ భయపడుతూ ఓంకార్‌ను వేడుకొన్నారు.

నందితా శ్వేతను రెచ్చగొట్టిన బండ్ల గణేష్

ఇక ఫైనల్ రౌండ్‌లో మూడు కోడి గుడ్లను పగలకొట్టేందుకు నందితా శ్వేత ప్రయత్నించింది. అయితే తీరా కొట్టే ముందు వన్ సెకన్ అంటూ ఆపేశాడు. దాంతో పక్కనే ఉన్న బండ్ల గణేష్ కొట్టేయ్ నందితా.. ఆపకు.. అంటూ రెచ్చగొట్టాడు. దాంతో ఓంకార్ వద్దు అని.. బండ్ల గణేష్ కొట్టు అని రెచ్చగొట్టారు. ఇద్దరి మధ్య ఎటు తేల్చుకోలేక నందితా ఏం చేయాలి.. మీరు ఆపండి అంటూ కంగారు పడిపోయింది.

పిస్టల్‌ను తలకు కొట్టుకొన్న బండ్ల గణేష్

ఓ దశలో ఓంకార్ పెట్టే టెన్షన్ భరించలేక బండ్ల గణేష్.. పిస్టల్ చేతికి ఇచ్చావు. తలకు కొట్టుకోవాలా? ఆ గేమ్ ఏందో గానీ.. ఇంత టార్చర్ అవసరమా? ఇంత టెన్షన్ ఎవరూ పెట్టలేదు. నీళ్లు కావాలి అని అడిగాడు. నీళ్లు ఇవ్వగానే తాగుతూ.. ప్రపంచంలో నాకు ఎవరూ నీళ్లు తాగించలేదు అంటూ బండ్ల గణేష్ తనదైన శైలిలో అంటూ కామెడీ పండించాడు.

హై ఎనర్జీతో సిక్త్‌సెన్స్ సీజన్ 4

ఇక సిక్త్‌సెన్స్ షో ఆద్యంతం వినోదంగా హై ఎనర్జీతో సాగినట్టు కనిపించింది. పాటలు, పిల్లల డ్యాన్సులతో షో కేక పెట్టించింది. మంచి ప్రేక్షకాదరణ పొందుతున్న ఈ షో శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు స్టార్ మాలో ప్రసారం కానున్నది. బండ్ల గణేష్ చేసిన రచ్చతో తాజా ఎపిసోడ్‌పై మరింత ఆసక్తి పెరిగింది.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here