ఇండస్ట్రీ హిట్ కోసం ‘వకీల్ సాబ్’ తొలి అడుగు పడింది

0
14

పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ పై ఉన్న అంచనాలు చూస్తుంటే నాన్ బాహుబలి రికార్డు నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. గత ఏడాది సంక్రాంతికి వచ్చి రికార్డుగా నిలిచిన అల వైకుంఠపురంలో సినిమా రికార్డును వకీల్ సాబ్ ఈజీగా బ్రేక్ చేయడం ఖాయం అంటూ అభిమానులు చాలా నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. నాన్ బాహుబలి రికార్డును బ్రేక్ చేయాలంటే ఓపెనింగ్స్ సాలిడ్ గా రావాల్సిన అవసరం ఉంది. ఓపెనింగ్స్ విషయంలో స్ట్రాంగ్ గా ఉండి సినిమా పాజిటివ్ టాక్ ను దక్కించుకుంటే ఇక వకీల్ సాబ్ సినిమా ఇండస్ట్రీ హిట్ అయినట్లే అంటూ ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అందులో భాగంగా మొదటి అడుగు పడ్డట్లయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో మిడ్ నైట్ షో లు మరియు బెనిఫిట్ షో లకు ప్రభుత్వాలు దాదాపుగా అనుమతులు ఇచ్చినట్లే అంటున్నారు. సినిమా పరిశ్రమ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వాలు పెద్ద మనసుతో ప్రత్యేక షో లకు ఓకే చెబుతున్నట్లుగా తెలుస్తోంది.

వకీల్ సాబ్ సినిమా రికార్డులు బ్రేక్ చేయాలంటే ఓపెనింగ్ కలెక్షన్స్ పైనే ఆధారపడి ఉంది. ఇప్పుడు మొదటి రోజు ప్రత్యేక ఆటలకు అనుమతులు రావడంతో పాటు టికెట్ల రేట్లు వెయ్యి నుండి రెండు వేల వరకు ఉండటం వల్ల ఖచ్చితంగా రికార్డులు బ్రేక్ అవ్వడం ఖాయం అంటున్నారు. వకీల్ సాబ్ రికార్డు బ్రేక్ లకు తొలి అడుగు పడ్డట్లే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పింక్ మూవీ ఒక మెసేజ్ ఓరియంటెడ్ మహిళ చిత్రం. అలాంటి రీమేక్ కు ఇంతటి బజ్ క్రియేట్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. కేవలం పవన్ కళ్యాణ్ స్టార్ డం వల్లే ఇది సాధ్యం అయ్యింది. వకీల్ సాబ్ సినిమా కు భారీగా బజ్ క్రియేట్ చేయడంలో నిర్మాత దిల్ రాజు నూటికి నూరుశాతం సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు.

ఈ వారంలో విడుదల కాబోతున్న వకీల్ సాబ్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ మొదలు అయ్యింది. హైదరాబాద్ లోని మొదటి రోజు షో లు దాదాపు అన్ని కూడా హౌస్ ఫుల్ అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్ లో అదిరిపోయే రికార్డును పవన్ ఫ్యాన్స్ క్రియేట్ చేశారు. కేవలం గంట వ్యవధిలోనే రికార్డు స్తాయిలో బుకింగ్ నమోదు అయినట్లుగా చెబుతున్నారు. మొత్తానికి వకీల్ సాబ్ రికార్డుల వేట తొలి అడుగు పడిందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here