ఇండస్ట్రీలో కలర్ గురించి కామెంట్ చేసేవారు

0
20

తెలుగు ఇండస్ట్రీ అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా పరిచయం అయిపోయింది. ఇదివరకులా కాకుండా ఇప్పుడు తెలుగు నుండి కూడా ఎన్నో సినిమాలు బయటికి వెళ్తున్నాయి. బయట సినిమాలు తెలుగులో రీమేక్ అవుతున్నాయి. కానీ ఇంకా ఎక్కడి ఇండస్ట్రీలో అక్కడి వారు అవకాశాలు పొందేందుకు కష్టపడుతూనే ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మయిలకే అవకాశాలు దొరకడం కరువు ఐపోయాయని కొందరు హీరోయిన్లను చూస్తే అర్ధమవుతుంది. ఆ కోవలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వారు కూడా ఉంటారు. చాందిని చౌదరి అనే తెలుగమ్మాయి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతుంది.

అలాగే కొన్నేళ్లుగా యూట్యూబ్ నుండి సినిమాలవైపు కెరీర్ మలుచుకున్న చాందిని.. ఇన్నేళ్లకు ఓ సరైన ట్రాక్ లో ఉందని ఆమె భావిస్తుంది. అయితే కెరీర్ తొలినాళ్లలో ఆమె ఎలాంటి అవమానాలు ఎదుర్కొంది అనే విషయాలు చాలా ఇంటర్వ్యూలలో చెప్పింది. ప్రస్తుతం చాందిని చెప్పిన పలు ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవలే కలర్ ఫోటో అనే సినిమాతో మంచి హిట్ అందుకుంది చాందిని. లాక్డౌన్ సమయంలో ఓటిటి రిలీజ్ అయినటువంటి కలర్ ఫోటో మూవీ విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకొని చాందినికి మంచి పేరు తీసుకొచ్చింది.

అయితే చాందిని మాట్లాడుతూ.. పరభాషా హీరోయిన్స్ కంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు పొందాలంటే తెలుగు అమ్మాయిలే ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. ఒకవేళ కష్టపడినా అవకాశం వస్తుందనే గ్యారంటీ లేదు. ఇప్పటివరకు నేను కొన్ని సినిమాలైనా చేసాను. కానీ నాకంటే ముందుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇంకా అవకాశాలకోసం ట్రై చేస్తున్నవారు చాలామంది ఉన్నారు. అయితే కెరీర్ లో ఏదైనా వివక్షకు గురయ్యారా అనే ప్రశ్నకు స్పందించి.. అవును కెరీర్ కొత్తలో కొంతమంది “నువ్ ఏమంత కలర్ లో లేవు” అని కామెంట్స్ చేసినట్లు చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో ఇంకా వర్ణ వివక్ష నడుస్తుందా అని తనకే ఆశ్చర్యం కలిగిందని చెబుతోంది ఈ కలర్ ఫోటో చిన్నది. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నట్లు తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here