‘ఆ హీరోయిన్‌తో సుశాంత్ పీకల్లోతు ప్రేమలో.. ఆ ఇద్దరి మధ్య రియా చక్రవర్తి చిచ్చు’

0
62

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌‌కు ఇతర హీరోయిన్లతో ఉన్న సన్నిహిత సంబంధాలను ఆయన స్నేహితుడు శామ్యూల్ హోకిప్ ఇటీవల ప్రముఖ ఆంగ్ల దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. రియా చక్రవర్తి ఆయన జీవితంలో ప్రవేశించడానికి ముందు ఏం జరిగింది? రియా చక్రవర్తి అతడి జీవితంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి సంఘటనలు చేటుచేసుకొన్నాయనే విషయాలను శ్యామూల్ స్పష్టంగా వెల్లడించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సైఫ్ ఆలీ ఖాన్ కూతురు సారా ఆలీ ఖాన్‌తో ఉన్న సంబంధాలను ఆసక్తికరంగా చెబుతూ..

ఒకరంటే మరొకరికి చెప్పలేనంత ప్రేమ
కేదారినాథ్ సినిమా షూటింగ్ సమయంలో సారా ఆలీఖాన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇద్దరు చాలా దగ్గరయ్యారు. ఒకరంటే మరొకరికి చెప్పలేనంత ఇష్టం. వారిద్దరి రొమాంటిక్ మూమెంట్స్ మాటల్లో చెప్పలేం. వారిద్దరూ కలిసినన్పుడు చిన్న పిల్లల మధ్య ఉండే స్వచ్ఛమైన ప్రేమ కనిపించేది అని శ్యామ్యూల్ హోకిప్ చెప్పారు.

వారిద్దరి మధ్య విడదీయలేనంతగా
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సారా ఆలీఖాన్ మధ్య బంధంలో అత్యంత పవిత్రమైనది. వారిద్దరి మధ్య విడదీయలేనంత అప్యాయత, అనురాగాలు కనిపించేవి. ఈ రోజుల్లో యువతీ, యువకుల మధ్య ఉండే రిలేషన్స్‌లో అసలే కనిపించనంతగా వారి మధ్య ప్రేమ అంత స్వచ్ఛంగా ఉండేది అని శ్యామూల్ హోకిప్ పేర్కొన్నారు.

వారిద్దరి కెమిస్ట్రీ చూస్తే ఎవరికైనా..
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సారా ఆలీ ఖాన్ మధ్య కేవలం ప్రేమనే కాకుండా వారిద్దరికి ఒకరంటే మరొకరికి చెప్పలేనంత గౌరవం. ఒకరిపై మరొకరు కవితలు చెప్పుకొననే వారు. వారిద్దరి మధ్య అన్యోన్యతను చూస్తే వెండితెర మీద మంచి ప్రేమ కథ చూసినట్టు ఉండేది. ఎప్పుడూ నవ్వుతూ, సంతోషంగా కనిపించేవారు. సుశాంత్ ఉంటే ఆమె పెదవి మీద ఎప్పుడూ చిరునవ్వు ఉండేది. వారిద్దరి మధ్య సంబంధాల్లో స్వచ్ఛత ఉండేది అని శ్యామ్యూల్ హోకిప్ తెలిపారు.

రియా కారణంగానే బ్రేకప్
సారా, సుశాంత్ మధ్య రిలేషన్ బ్రేక్ కావడానికి రియా చక్రవర్తి కారణం. రియా చక్రవర్తి ప్రవేశించిన తర్వాత సుశాంత్, సారా ఆలీ ఖాన్ మధ్య రిలేషన్ బ్రేకప్ అయింది. రియా చక్రవర్తి కంటే సారా అలీ ఖాన్ అంటేనే సుశాంత్‌కు ఎక్కువ ప్రేమ, ఇష్టం. సారాను ఇష్టపడినంతగా రియాను ఇష్టపడినట్టు కనిపించలేదు అని శ్యామూల్ అభిప్రాయపడ్డారు.

సుశాంత్‌తో ఏడాది కలిసి ఉన్నా
సుశాంత్‌తో నా ప్రయాణం గొప్పగా సాగిందని శ్యామ్యూల్ పేర్కొన్నారు. ఆయనతో అక్టోబర్ 2018 నుంచి జూలై 2019 వరకు ఉన్నాను. మేమిద్దరి కలిసి ఒకే కారులో ప్రయాణించే వాళ్లం. జిమ్, రెస్టారెంట్, ఇతర ప్రదేశాలకు కలిసి వెళ్లే వాళ్లం. ఏడాది కాలంలో నేను సుశాంత్‌కు చాలా దగ్గరయ్యాను. సుశాంత్ కొంత మంది సన్నిహితంగా ఉండేవారు. వారిని బ్రో టీమ్ అని సుశాంత్ పిలిచేవాడు అని శ్యామూల్ చెప్పారు.

సారా ఆలీ ఖాన్‌ను హెచ్చరించిన తల్లి
కేదారినాథ్ షూటింగ్ సమయంలో సుశాంత్‌తో సారా ఆలీఖాన్ సన్నిహితంగా ఉంటున్నారనే వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. అయితే తొలి చిత్రం చేసే హీరోతో సాధారణంగా ప్రేమలో పడే అవకాశం ఉంటుందని భావించిన సారా అలీఖాన్ తల్లి అమృతా సింగ్ వారిని హెచ్చరించినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా శ్యామూల్ చెప్పిన విషయాలు వారిద్దరి మధ్య ప్రేమ ఉందనే విషయాన్ని బలపరిచేలా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here