ఆ స్టార్ హీరో కథను ఇంకా ఫైనల్ చేయని జక్కన్న.. టెన్షన్ లో బాహుబలి రైటర్..

0
15

అసలైన పాన్ ఇండియా మూవీ అంటే ఏమిటో నిరూపించిన ఏకైక దర్శకుడు రాజమౌళి. ఆయనతో సినిమా అంటే ఎలాంటి స్టార్ హీరో అయినా సరే క్షణాల్లో డేట్స్ ఇచ్చేస్తారు. గెస్ట్ రోల్ చేయడానికైనా సరే ఏ మాత్రం నో చెప్పరు. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి చూపు RRR సినిమాపైనే ఉంది. ఆ సినిమాతో రాజమౌళి ఇంకా టాలీవుడ్ మార్కెట్ ని ఏ రేంజ్ కు పెంచుతాడో అని చర్చించుకుంటున్నారు.

ఇక ఓ వర్గం వారి చూపు మాత్రం ఎక్కువగా మహేష్ బాబు ప్రాజెక్ట్ పైనే ఉంది. ఆ కథపై అనేక రకాల రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక రైటర్ విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం కొంత టెన్షన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అసలు రాజమౌళి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని ఎంతో ఆసక్తిగాను ఎదురు చేస్తున్నారట.

రాజమౌళి ఎలాంటి సినిమా చేసినా

సాధారణంగా రాజమౌళి ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో వారి తండ్రి కె.విజయేంద్రప్రసాద్ పాత్ర ఎంతో ఉంటుంది. ఏదైనా కథ చెబితే దానికి ఉహించినదానికంటే ఎక్కువ స్థాయిలో తెరకెక్కించడం రాజమౌళికి అలవాటు అని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ వివరణ ఇచ్చారు. అంతే కాకుండా రాజమౌళి ఒక కథను సెట్స్ పైకి తీసుకువెలితే ఎంతో నిబద్దతో పూర్తి చేస్తాడని అందులోనే సంతోషాన్ని వెతుక్కుంటాడాని కూడా అన్నారు.

ఆయననే నమ్ముకున్నారు

రాజమౌళి తెరకెక్కించిన 11 సినిమాల్లో 9 సినిమాలకు కె.విజయేంద్ర ప్రసాద్ కథలు అందించారు. ఇక RRR తో పాటు మహేష్ బాబు సినిమాకు కూడా జక్కన్న ఆయన కలాన్ని నమ్ముకుంటున్నారు. ఒకసారి కథ ఇచ్చాను అంటే కొన్ని విషయాలపై తప్పితే రాజమౌళి మరోసారి తనను ఏ మాత్రం అడగరని సెట్స్ పైకి బౌండెడ్ స్క్రిప్ట్ తోనే ముందుకి వెళుతుంటాడాని అన్నారు. ఎలాంటి కథ అయినా సరే తన మనసులో ముందే ఉహించుకుంటాడాని కూడా అన్నారు.

ఎక్కువగా అలాంటి కథలు

రాజమౌళి మనసులో ఏదైతే అనుకుంటాడో దాన్ని బలంగా వెండితెరపైకి తీసుకురాగలడు. ఒకవేళ కథ నచ్చకపోతే మాత్రం మొదట్లోనే ఓపెన్ గా చెప్పేస్తాడు. ముందు కథ విని కొత్తగా ఆసక్తిగా ఉందని ఫీల్ అయితేనే సినిమాను స్టార్ట్ చేస్తాడు. రాజమౌళికి ఎక్కువగా ఎమోషన్ తో కూడిన యాక్షన్ సన్నివేశాలు అంటేనే ఇష్టం. అలాంటి కథలు రాయమని ఎక్కువగా నాకు చెబుతుంటాడు అని కె.విజయేంద్ర ప్రసాద్ వివరణ ఇచ్చారు.

ఇంకా మహేష్ కథ పూర్తవ్వలేదు

ఇక మహేష్ బాబు సినిమా కథపై కూడా కె.విజయేంద్ర ప్రసాద్ ఒక వివరణ అయితే ఇచ్చారు. చాలామంది ఆ కథ కూడా మొత్తం పూర్తయ్యిందని అనుకుంటున్న తరుణంలో కె.విజయేంద్ర ప్రసాద్ మాత్రం ఇంకా ఫైనల్ కాలేదని అన్నారు. ఆ కథను రాజమౌళి పూర్తిగా విన్న తరువాత ఫైనల్ చేస్తాడు. ఇంకా నేను దాని మీదే వర్క్ చేస్తున్నాను అని ఈ సీనియర్ రైటర్ వివరణ ఇచ్చారు. ఇక ఆ విషయంలో కూడా రాజమౌళి ఎలాంటి కథనాన్ని అడుగుతాడో అని కూడా కె.విజయేంద్ర ప్రసాద్ వివరణ ఇచ్చారు.

2022 సంక్రాంతికి రిలీజ్

ఇక ప్రస్తుతం మహష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గీతగోవిందం దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాపై మహేష్ అయితే గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఇక 2022 సంక్రాంతికి రిలీజ్ చేసేలా జెట్ స్పీడ్ లో షూటింగ్ పనులను పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్కుతో కనిపించనున్నాడు. సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.

మహేష్ తలచుకుంటే

ఇక RRR విడుదలైన అనంతరం రాజమౌళి మహేష్ బాబు సినిమాపై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తుంది. ప్రీ ప్రొడక్షన్ పనుల కోసమే దాదాపు ఆరు నెలల సమయం పడుతుందట. దీంతో మహేష్ తలచుకుంటే మరో రెండు సినిమాలను పూర్తి చేయవచ్చు. ఇక మధ్యలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా అనుకున్న విషయం తెలిసిందే. అలాగే అనిల్ రావిపూడి కూడా క్యూలో ఉన్నాడు. మరి వారిలో మహేష్ ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here