ఆ సినిమా విషయంలో నిధి లక్కీనా.. అన్ లక్కీనా..??

0
33

ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ అండ్ అప్ కమింగ్ హీరోయిన్స్ టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించేందుకు తహతహలాడుతుంటారు. కానీ అవకాశాలు అనేవి ఊరికే రావుగా.. ఫేవరేట్ స్టార్స్ పక్కన నటించే అవకాశాలు కాస్త ఆలస్యంగానే వస్తాయి. కొందరి విషయంలో మాత్రం లక్ ఫేవర్ చేస్తే స్టార్ హీరోలతో నటించే అవకాశం త్వరగా వస్తుంది. ఆ కోవకు చెందిన హీరోయిన్లను చాలా లక్కీ అంటారు. అలాంటి అవకాశలు దక్కించుకుని లక్కీ హీరోయిన్ అయిపోయింది టాలెంటెడ్ యంగ్ హీరోయిన్ నిధిఅగర్వాల్. ఈ భామ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటివరకు తెలుగులో చేసింది మూడు సినిమాలే కానీ క్రేజ్ మాత్రం స్టార్ హీరోయిన్స్ రేంజిలో దక్కించుకుంది.

మరి అసలు నిధిని లక్కీ అని ఎందుకు అంటున్నారు అంటే.. ప్రస్తుతం అమ్మడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన లీడ్ క్యారెక్టర్ పోషిస్తుంది. అలాగే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో కూడా అవకాశం కొట్టేసేలా ఉందని సమాచారం. అమ్మడు పవర్ స్టార్ నటిస్తున్న ‘హరిహరవీరమల్లు’ సినిమాలో లీడ్ హీరోయిన్ గా కనిపించనుంది. కానీ మహేష్ తో సినిమా అనేసరికి నిధి ఫ్యాన్స్ కంగారు పడుతున్నారట. ఎందుకంటే ఇటీవలే డైరెక్టర్ త్రివిక్రమ్ – మహేష్ బాబు కాంబినేషన్ మూడోసారి కన్ఫర్మ్ అయినటువంటి విషయం తెలిసిందే. అతడు – ఖలేజా సినిమాల తర్వాత రాబోతుండటంతో కాంబినేషన్ పై హ్యాట్రిక్ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో కూడా త్రివిక్రమ్ ఇద్దరు హీరోయిన్లను ప్లాన్ చేసాడట.

అందులో లీడ్ హీరోయిన్ గా పూజాహెగ్డే పేరు వినిపిస్తుంది. అయితే సెకండ్ హీరోయిన్ గా నిధి పేరు వినిపిస్తుంది. ఆ విషయంలోనే అమ్మడిని కొంచం జాగ్రత్తపడమని చెబుతున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ అనేది కామన్. కానీ లీడ్ హీరోయిన్లకు మాత్రమే క్రేజ్ వస్తుంది. ఇప్పటివరకు ఆయన సినిమాల్లో సెకండ్ హీరోయిన్స్ గా చేసినవారంతా పెద్దగా క్లిక్ అవ్వలేదు. అసలే పవర్ స్టార్ లాంటి హీరోతో మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్ చేస్తోంది నిధి. మరి ఇందులో సెకండ్ హీరోయిన్ అంటే దురదృష్టం అంటున్నారు ఫ్యాన్స్. కానీ నిధికి అదృష్టం వచ్చే అవకాశం కూడా ఉందట. ఎలాగంటే.. ఒకవేళ లీడ్ హీరోయిన్ గా పూజాకు డేట్స్ సెట్ అవ్వకపోతే మాత్రం ఆ ఛాన్స్ నిధికి దక్కే అవకాశం ఉందని టాక్. చూడాలి మరి నిధి లక్కీ అవుతుందో అన్ లక్కీ అవుతుందో..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here