ఆ మూడు పై కాజల్ ఆశలు

0
18

సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవల కాలంలో కొత్త సినిమాలకు కమిట్ అవుతున్నట్లుగా అనిపించడం లేదు. ముఖ్యంగా పెళ్లి తర్వాత ఆమె సినిమాల ఎంపిక విషయంలో స్పీడ్ గా నిర్ణయం తీసుకోవడం లేదు. దానికి తోడు కరోనా కూడా ఆమె సినిమాల సంఖ్య స్పీడ్ గా పెరగక పోవడం కు కారణం అంటున్నారు. కాజల్ అగర్వాల్ నటించిన నటిస్తున్న ఆచార్య.. ఇండియన్ 2 మరియు నాగార్జున సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ సినిమాలు విడుదల తర్వాత మరిన్ని పెద్ద ఆఫర్లు వస్తాయని కాజల్ నమ్మకంగా ఉంది. అందుకే చిన్న పాత్రలకు ఆమె నో చెప్తోందట.

ఆ మూడు ఫలితాలు వచ్చే వరకు వెయిట్ అండ్ సీ అన్నట్లుగా కాజల్ కొత్త సినిమాల విషయంలో ఆచి తూచి వ్యవహరించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల వెబ్ సిరీస్ తో వచ్చి నిరాశ పర్చిన కాజల్ కేవలం హీరోయిన్ గా అది కూడా కమర్షియల్ హీరోయిన్ గా మాత్రమే నటించాలని ఆశ పడుతోంది. అందుకే ప్రస్తుతం చేస్తున్న మూడు సినిమాల ఫలితాలను ఆధారంగా తదుపరి సినిమాల ఎంపిక చేసుకోవాలనే నిర్ణయానికి ఈ అమ్మడు వచ్చిందట. పెళ్లి అయినా కూడా కమర్షియల్ సినిమాల్లో నటించేందుకు అందాల విందుకు సిద్దంగా ఉన్నట్లుగా చెబుతోంది.

ఈ అమ్మడి మూడు సినిమాలు కూడా మూడు స్టేజ్ ల్లో ఉన్నాయి. ఆచార్య సినిమా దాదాపుగా పూర్తి అయ్యింది. పరిస్థితులు కుదుట పడితే వెంటనే విడుదల అవ్వబోతుంది. ఇక ఇండియన్ 2 సినిమా వివాదాల కారణంగా నిలిచి పోయింది. ఇక నాగార్జునతో ఇటీవలే సినిమాను మొదలు పెట్టింది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ ముగించుకున్న ఆ సినిమా అన్ని కలిసి వస్తే ఈ ఏడాదిలోనే విడుదల అయ్యే అవకాశం ఉందంటున్నారు. అందుకే కాజల్ తదుపరి సినిమాల విషయంలో వెయిట్ అండ్ సీ అన్నట్లుగా వ్యవహిస్తూ లేడీ ఓరియంటెడ్ స్క్రిప్ట్ లను తిరష్కరిస్తూ వస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here