ఆ పనిచేశానని.. ఇంట్లోంచి వెళ్లగొట్టారు

0
19

సినిమాలకన్నా.. వ్యక్తిగత జీవితంలోని వివాదాలతోనే గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ‘వనితా విజయ్ కుమార్’. తన కుటుంబ సభ్యులు తనను వెలివేశారంటూ పలుమార్లు మీడియా ఎదుట వాపోయిన వనితా.. తాజాగా మరోసారి ఆవేదన వ్యక్తంచేశారు. తన కుటుంబం తనను ఇంటి నుంచి గెంటేసిందని వాపోయారు.

వనితా విజయ్ కుమార్ ఇప్పటి వరకు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఈ విషయంలో ఎంతో మంది ఎన్నోవిధాలుగా ఆమెను విమర్శించారు. అయితే.. అందరికీ తనదైన రీతిలో సమాధానం చెబుతూ వచ్చారు. తాజాగా.. సోషల్ మీడియా వేదికగా తన వ్యక్తిగత జీవితంలోని కష్టనష్టాల గురించి చెప్పుకొచ్చారు.

ఒకటి కన్నా ఎక్కువ పెళ్లిళ్లు చేసుకోవడం ఎవరికీ సరదా కాదని చెప్పారు వనితా. తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందేనని అయితే.. తాను రెండుసార్లు విడాకులు తీసుకోవడానికి తన తల్లిదండ్రులు కూడా ఓ కారణమని చెప్పారు.

తనకు జీవితం అంటే ఏంటో తెలియని 18 ఏళ్ల వయసులో పెళ్లి చేశారని చెప్పారు వనితా. ఈ క్రమంలో తన భర్తతో ఎన్నోసార్లు గొడవలు జరిగాయని దీంతో తాను మానసికంగా కుంగిపోయానని చెప్పారు. చివరకు చేసేదేమీ లేక తాను విడాకులు తీసుకున్నట్టు చెప్పారు. అయితే.. తాను విడాకులు తీసుకోవడం తన తల్లిదండ్రులకు నచ్చలేదని చెప్పారు. తన వల్ల వారి పరువు పోతుందని ఇంట్లోనుంచి గెంటేశారని చెప్పారు వనిత.

అలాంటి పరిస్థితుల్లో.. ముగ్గురు పిల్లలను తీసుకొని బయటకుక వచ్చినట్టు చెప్పారు. ఆ తర్వాత ఒక తోడు ఉంటే బాగుంటుందని ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నానన్నారు. చిన్న చిన్న గొడవలున్నా.. తమ జీవితం ఎంతో ఆనందంగా సాగిపోయిందన్నారు. ఇలాంటి సమయంలో మళ్లీ తన తండ్రి విజయ్ కుమార్ ఎంటరయ్యారని చెప్పారు.

పిల్లల పెంపకం గురించి కేసు పెట్టడం వల్ల తన భర్త నుంచి విడాకులు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. అయితే.. జీవితంలో తగిలిన ఎదురు దెబ్బల వల్లనే ఎన్నో విషయాలు తెలుసుకున్నానని చెప్పారు వనిత.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here