ఆలియాభట్ సోదరికి రేప్ బెదిరింపులు.. అంతు చూస్తామని హెచ్చరికలు.. కారణం అదేనా?

0
45

బాలీవుడ్‌లో కొన్ని ప్రముఖ కుటుంబాలకు కొద్ది రోజులుగా బెదిరింపులు రావడం సాధారణంగా మారాయి. జోహర్, కపూర్లు, భట్ కుటుంబాలు గతంలో తమ కుటుంబ సభ్యులకు వస్తున్న బెదిరింపులపై ఫిర్యాదు చేయడం తెలిసిందే. సుశాంత్ సింగ్ మరణం తర్వాత భట్ కుటుంబానికి ఇలాంటి హెచ్చరికలు, బెదిరింపులు ఎక్కువయ్యాయనే విషయాన్ని వెల్లడించారు. తమకు వస్తున్న బెదిరింపు లేఖలను ఆలియా భట్ సోదరి షహీన్ భట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన సోదరికి వస్తున్న బెదిరింపులపై అలియాభట్ తీవ్రంగా స్పందించారు. ఇంతకు ఆ బెదిరింపుల వ్యవహారంలో షహీన్, కుటుంబ సభ్యులు ఏమన్నారంటే..

కొద్ది రోజులుగా ఫ్యామిలీకి బెదిరింపులు
గత కొద్దిరోజులుగా నాకు, నా కుటుంబ సభ్యులకు బెదిరింపులు, హెచ్చరిక మెసేజ్ వస్తున్నాయి. చాలా మంది నన్ను, నాకుటుంబ సభ్యులను వేధిస్తూ ఇబ్బందికి గురిచేస్తున్నారు. అయితే వాటిని భరిస్తూ, ఎవరికీ చెప్పకుండా ఉంటున్నాం. కానీ అలాంటి అకతాయిల చేష్టలు సోషల్ మీడియాలో మరింత ఎక్కువయ్యాయి. అందుకే ఈ బెదిరింపుల పోస్టును సోషల్ మీడియాలో షేర్ చేశాం అని షహీన్ భట్ పేర్కొన్నారు.

ఇక భరించే ఓపిక లేదు
ఇక సోషల్ మీడియాలో వేధింపులకు పాల్పడే అకతాయిలను వదిలిపెట్టే ప్రశ్నేలేదు. ఇక వాటిని చూస్తూ భరించే శక్తి నశించింది. మమల్ని వేధిస్తూ వస్తున్న మెసేజ్‌లను తీవ్రంగా పరిగణిస్తాం. అందుకే నాపై దారుణమైన కామెంట్లు చేస్తున్న వారి స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో పోస్టు చేశాం. ఇక నుంచి మేము కూడా ఎదురుదాడి చేస్తాం అని షహీన్ భట్ ఘాటుగా పోస్టుచేసిన మెసేజ్‌లో పేర్కొన్నారు.

ప్రతీ 15 నిమిషాలకు ఓ అత్యాచారం
నాలాగా సహనంతో ఇలాంటి బెదిరింపులు, వేధింపులు భరించడం వల్లే దేశంలో మహిళలపై అఘాయిత్యాలు, దాడులు పెరిగిపోయాయి. దేశంలో ప్రతీ 15 నిమిషాలకు ఓ రేప్ జరుగుతున్నది. ఇలాంటి గణాంకాలు మీకు ఆశ్చర్యం కలిగించవచ్చేమో కానీ.. మాకు ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇలాంటి వేధింపులకు గురవుతున్న మహిళలకు ధైర్యం కలిగించడానికే సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేశాను అని అన్నారు.

ఐపీ అడ్రస్‌లను ట్రాక్ చేస్తాం
నాకు చాలా పెద్ద మొత్తంలో నెటిజన్ల నుంచి రేప్ చేస్తామని, చంపేస్తామనే బెదిరింపు సందేశాలు వస్తున్నాయి. అలా మెసేజ్ వచ్చే అకౌంట్లను బ్లాక్ చేసే దానిని. ఇక నుంచి అలాంటి అకౌంట్లు బ్లాక్ చేయను. వాటిపై ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకొనేలా ప్రయత్నిస్తాం. అలాంటి అకౌంట్ల ఐపీ అడ్రస్‌లను ట్రాక్ చేసి వారిని శిక్షిస్తాం అని షహీన్ భట్ పేర్కొన్నారు. సుశాంత్ మరణం తర్వాత ఈ బెదిరింపులు ఎక్కువైనట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

రచయితగా పాపులర్
ప్రముఖ సినీ దర్శకుడు మహేష్ భట్, సోని రజ్దాన్ కూతురైన షహీన్ రచయిత్రిగా గుర్తింపు పొందారు. ఆలియాభట్ సోదరిగా ప్రేక్షకులకు సుపరిచితులు. మహిళల హక్కులు, ఇతర సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆమె రాసిన నవల ఐ హావ్ నెవర్ బీన్ (అన్)హ్యాప్పియర్ అనే నవలను రాయగా.. అత్యధిక కాపీలు అమ్ముడైన పుస్తకంగా ఘనతను సాధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here