ఆపదలో దర్శకుడికి సాయం.. మనసు దోచిన సప్తగిరి

0
33

ప్రముఖ రచయిత-దర్శకుడు నంద్యాల రవికి హాస్యనటుడు.. హీరో సప్తగిరి సకాలంలో సాయమందించి టాలీవుడ్ లో అందరి హృదయాలను గెలుచుకున్నారు. నంద్యాల రవి వైద్య ఖర్చుల కోసం అతడు రూ.1లక్ష రూపాయల సాయం అందించారు.

తాజా సమాచారం ప్రకారం.. నంద్యాల రవి ఇటీవల తీవ్రమైన COVID-19 వైరస్ తో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హాస్పిటల్ బిల్లు రూ.6- 7 లక్షలు వచ్చిందట. డైరెక్టర్ కుటుంబానికి అంత పెద్ద మొత్తాన్ని భరించే శక్తి లేదు. సప్తగిరి తన మానవతా సాయంగా లక్ష అందించడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.

గత ఏడాది తెలుగు సినీ కార్మికులకు ఉపశమనం పునరావాసం కల్పించేందుకు మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి) కు సప్తగిరి రూ .2 లక్షలు అందించారు. ఒక సాధారణ నటుడి గొప్ప మనసుకు ఇవన్నీ సాక్ష్యాలు. అతడి మంచిని ప్రశంసించకుండా ఉండలేం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here