‘ఆచార్య’ లాహెలాహె అదరగొట్టేస్తోంది

0
20

మెగాస్టార్ చిరంజీవి మరియు మణిశర్మల కాంబోలో గతంలో వచ్చిన పలు సినిమా ఆల్బంలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక తాజాగా వీరిద్దరు ఆచార్య సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చిరంజీవితో చాలా కాలం తర్వాత మణిశర్మ చేస్తున్న సినిమా అవ్వడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా మొదటి పాట లాహె లాహె అదరగొట్టేస్తోంది. దాదాపు నెల రోజుల క్రితం వచ్చిన లాహె లాహె సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది. ఏకంగా 30 మిలియన్ ల వ్యూస్ ను క్రాస్ చేసి లాహె లాహె దూసుకు పోతుంది. ఈమద్య కాలంలో సారంగదరియా సాంగ్ తర్వాత అత్యధిక వ్యూస్ ను దక్కించుకున్న పాటగా లాహె లాహె నిలిచింది.

లాహె లాహె సాంగ్ లో మెగాస్టార్ చిన్న డాన్స్ బిట్ తో పాటు సీనియర్ హీరోయిన్ సంగీత కాస్ట్యూమ్స్ మరియు డాన్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. కాజల్ కూడా ఈ పాటలో కనిపించింది. పాట మేకింగ్ వీడియో మరియు టెంపుల్ సిటీ సెట్టింగ్ ను కొద్ది భాగం చూపించడం వల్ల పాట చాలా కలర్ ఫుల్ గా ఉంది. పాట లిరిక్స్ కూడా చాలా విభిన్నంగా ఉన్నాయి. శివ పార్వతులకు సంబంధించిన ఈ పాట చాలా పెద్ద అర్థంను తెలిపే విధంగా ఉందంటూ కూడా కామెంట్స్ వస్తున్నాయి. మొత్తంగా లాహె లాహె సాంగ్ అన్ని విధాలుగా బాగుండటంతో భారీ వ్యూస్ ను దక్కించుకుంటుంది.

కొరటాల శివ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. కాజల్ మరియు పూజా  హెగ్డే లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా లో చిరు మరియు చరణ్ లు నక్సలైట్ గా కనిపించబోతున్నారని సమాచారం అందుతోంది. సినిమా ను వచ్చే వారం విడుదల చేయాల్సి ఉన్నా కూడా కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా వేయడం జరిగింది. కొత్త విడుదల తేదీ ఎప్పటి వరకు వచ్చేనో క్లారిటీ లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here