ఆచార్య ఆలయంలో నీలాంబరి పెత్తనం?

0
11

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్యలో నీలాంబరి తరహా పాత్ర ఉందా?  అందులో రమ్యకృష్ణ నటిస్తున్నారా? అంటే..

ఆచార్యలో నీలాంబరి అనే పాత్ర ఉంది. అయితే అందులో నటిస్తోంది రమ్యకృష్ణ కాదు. ఆ పాత్ర లో పూజా హెగ్డే కనిపిస్తుంది. అది కూడా చరణ్ సరసన అతిథిగా మెరుస్తుంది అంతే. తను ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో మెరుపులా కొన్ని సన్నివేశాల్లో మెరిసి మాయమవుతుందని కథనాలొస్తున్నాయి.

అసలింతకీ ఎవరీ నీలాంబరి..? ఆచార్యలో ఏం చేస్తుంటుంది? అంటే.. తనో గిరిజన మహిళ. ఉద్యమస్ఫూర్తి పోరాటాలతో నిండి ఉండే రామ్ చరణ్ ని అనుసరించే ఒక అందమైన గిరిజన యువతి అని తెలిసింది. ఇక నీలాంబరి అనగానే నరసింహా సినిమాలో రజనీతో పోటీపడి నటించిన రమ్యకృష్ణ ఆడియెన్ కి గుర్తుకొస్తుంది. అలాంటప్పుడు పూజా పాత్రను పరిమితంగా చూపిస్తే మహిళాభిమానుల హృదయాలు గాయపడతాయేమో?  మే 13 న విడుదలవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here