అల్లు అర్హ ఫస్ట్ డే షూటింగ్.. మొదటి రోజే 9కోట్ల విలువైన క్యారావాన్ తో గ్రాండ్ ఎంట్రీ

0
11

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎంట్రీ ఇవ్వడానికి చాలామంది వారసులు ఉన్నారు. అయితే ఒకప్పుడు స్టార్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చే వారసులు ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగానే భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంటున్నారు. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారాల కూతురు అల్లు అర్హ కూడా గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. శాకుంతలం సినిమాలో ఆమె ఒక హిస్టారికల్ పాత్రలో కనిపించనుంది. ఇక మొదటిరోజు ఆమె సెట్స్ లోకి రాగానే గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు.

మలయాళం ఇండస్ట్రీలో కూడా

అల్లు ఫ్యామిలీ నుంచి వచ్చిన అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న విషయం తెలిసిందే. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా మలయాళం ఇండస్ట్రీలో కూడా బన్నీ భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం పుష్పతో పాన్ ఇండియా లెవెల్లో అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే.

భారీ ఫ్యాన్ ఫాలోయింగ్

ఇక అల్లు అర్జు పిల్లలకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా కూతురు అల్లు అర్హ అయితే తన మాటలతో హావభావాలతో నెటిజన్లలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఆమె పేరు మీద ఎన్నో ఫ్యాన్స్ పేజెస్ కూడా ఉన్నాయి. ఒక్క స్టిల్ విడుదలైనా కూడా అది నిమిషాల్లో వైరల్ అవ్వాల్సిందే. ఎక్కువగా బన్నీ సతీమణి పిల్లలకు సంబంధించిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు.

ఎలాంటి డ్రెస్ వేసినా కూడా

ఇక గతంలో ఒకసారి అల్లు అర్హ పుట్టినరోజు సందర్భంగా అంజలి అంజలి అనే పాట కవర్ సాంగ్ చేయగా అది కొన్ని గంటల్లోనే ఇంటర్నేట్ వరల్డ్ లో ట్రెండ్ అయ్యింది. అందులో అల్లు అర్హ చూపించిన హావభావాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అల్లు అర్హకు ప్రస్తుతం 4 ఏళ్ళ వయసు. అయినప్పటికీ 10 ఏళ్ళ అమ్మాయిలా తన హావభావాలతో చూపరులను ఆకర్షిస్తోంది. ఎలాంటి డ్రెస్ వేసినా కూడా అర్హ చాలా క్యూట్ గా కనిపిస్తుంటుంది. కూతురిని చూసుకొని అల్లు అర్జున్ మురిసిపోని రోజు లేదు.

అల్లు అర్హను ఫైనల్ చేశారు

ఇక అల్లు అర్హ తరువాత తరం నటిగా గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత మెయిన్ లీడ్ లో నటిస్తున్న శాకుంతలం సినిమాలో అర్హ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. దర్శకుడు గుణశేఖర్ ఆ పాత్ర కోసం చాలా మందిని అనుకున్నప్పటికి ఫైనల్ గా అల్లు అర్హను ఫైనల్ చేశారు.

గ్రాండ్ గా వెల్కమ్

ఇక రీసెంట్ గా సెట్స్ లోకి అడుగుపెట్టిన అర్హకు చిత్ర యూనిట్ సభ్యులు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. ఇక మొదటిరోజే తన తండ్రి క్యారవాన్ తో సెట్స్ లోకి అడుగు పెట్టింది. సాధారణంగా బన్నీ తన కారావ్యాన్ ఎవరికి ఇవ్వడు. దానికి ఫాల్కన్ అని పేరు పెట్టుకున్న బన్నీ అత్యాధునిక టెక్నాలజీతో తనకు నచ్చినట్లుగా సిద్ధం చేయించుకున్నారు. ఆ కారవాన్ కోసం బన్నీ దాదాపు 9కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. అలాంటి ఖరీదైన వాహనం నుంచి అల్లు అర్హ మొదటిరోజు సెట్స్ కు వచ్చింది.

క్రమశిక్షణతో కనిపించింది

ఇక అల్లు అర్హకు మేకప్ వేస్తున్న ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వయసులో ప్రొఫెషనల్ నటిమణుల తరహాలో టైమింగ్ ను పాటిస్తూ షూటింగ్ లో చాలా క్రమశిక్షణతో కనిపించింది. అల్లరి చేయకుండా చిత్ర యూనిట్ సభ్యులందరితో చాలా సరదాగా గడిపిందట. ఇక గుణశేఖర్ అయితే అల్లు అర్హను టెస్ట్ షూట్ చేసిన రోజే సగం కాన్ఫిడెన్స్ వచ్చిందట. ఇక సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన తరువాత కూడా అల్లు అర్హ ఏ మాత్రం ఇబ్బంది పడకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతోందట.

ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని

ఇక శాకుంతలం సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సమంత టైటిల్ రోల్ లో నటిస్తుండగా దేవ్ మోహన్ దుష్యంత పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని గుణశేఖర్ చాలా తీవ్రంగా కష్టపడుతున్నాడు. గత కొన్నేళ్లుగా సరైన విజయం చూడని గుణశేఖర్ ప్రయోగాలు ఎన్ని వహిస్తూ చేస్తున్నా ఎందుకో కలిసి రావడం లేదు. ఇక ఆయన ప్రస్తుతం ఆశలన్ని కూడా శాకుంతలం సినిమాపైనే పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమా హిట్టయితేనే రానా దగ్గుబాటితో హిరణ్యకశిప కథను ఇంకా హై లెవెల్లో తెరకెక్కించడానికి కాస్త దైర్యంగా ఉంటుంది. మరి గుణశేఖర్ కు కాలం ఎంతవరకు కలిసో వస్తుందో చూడాలి.

పాన్ ఇండియా రేంజ్ కు ఏ మాత్రం తక్కువ కాకుండా

ఇక మరోవైపు అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 1కు సినిమాకు టచ్ ఇస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తరకెక్కుతున్న ఆ సినిమాను పాన్ ఇండియా రేంజ్ కు ఏ మాత్రం తక్కువ కాకుండా నిర్మిస్తున్నారు. ఇక సినిమానుం ఫైనల్ గా క్రిస్టమస్ సందర్భంగా ఈ ఏడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే ఈ సిజన్ కు పోటీగా KGF 2 కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here