అల్లు అర్జున్ తర్వాత రామ్ చరణ్ తో..!

0
23

స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో ‘పుష్ప’ అనే పాన్ ఇండియా మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకుంటాడు కాబట్టి తదుపరి సినిమాలు కూడా అదే స్థాయిలో ఉండనున్నాయి. ఇప్పటికే విజయ్ దేవరకొండతో సుక్కూ ఓ సినిమా చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం విజయ్ సినిమా కంటే ముందు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సుకుమార్ ఓ మూవీ చేయబోతున్నారని తెలుస్తోంది.

చరణ్ – సుకుమార్ కాంబినేషన్ లో ఇంతకముందు వచ్చిన ‘రంగస్థలం’ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా అప్పటికి టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. అయితే ఇప్పుడు ‘రంగస్థలం’ కాంబోలో మరో సినిమాకి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా ఎక్సపెక్ట్ చేయొచ్చని రామ్ చరణ్ బర్త్ డే వేడుకల్లో మైత్రీ నిర్మాత నవీన్ ఎర్నేని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇటీవల చరణ్ కు సుకుమార్ ఓ స్టోరీ వినిపించారని.. దీనికి చరణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందని టాక్ నడుస్తోంది.

ఇకపోతే ‘పుష్ప’ సినిమా అనుకున్న సమయం కంటే లేట్ అవుతుందని.. ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే సంక్రాంతికి విడుదల అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. మరి సుక్కూ ‘పుష్ప’ తర్వాత ముందుగా విజయ్ దేవరకొండ – చరణ్ లలో ఎవరితో సినిమా చేస్తాడో చూడాలి. ఇక ప్రస్తుతం ‘ఆర్.ఆర్ ఆర్’ మరియు ‘ఆచార్య’ సినిమాలలో నటిస్తున్న రామ్ చరణ్.. తదుపరి సినిమాను షో మ్యాన్ శంకర్ దర్శకత్వంలో చేయనున్నాడు. దీనికి దిల్ రాజు నిర్మాత. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ‘#RC15’ ఈ ఏడాది ద్వితీయార్థంలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా తర్వాత చరణ్ – సుకుమార్ కాంబోలో సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here