అయ్యో పాపం అది కూడా తెలీదట!.. అందుకే అలా జరిగిపోయిందన్న బండ్ల గణేష్

0
64

బండ్ల గణేష్ ఈ మధ్య తరుచుగా వార్తల్లో నిలుస్తున్నాడు. కరోనా పాజిటివ్ రావడం, క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకుని వైరస్‌ను జయించడం, ఆపై మాట్లడే తీరు, ఉండే విధానంలోనూ ఎన్నో మార్పులు వచ్చాయి. బండ్ల గణేష్‌లో వచ్చిన మార్పును చూసి అందరూ షాక్ అవుతున్నారు. మునుపటిలా ఆవేశంగా మాట్లాడటం లేదు, నోరు పారేసుకోవడం లేదు, వీలైతే సాయం చేద్దాం, ప్రేమిద్దాం అంటూ ప్రవచనాలు చెబుతున్నాడు. బండ్ల గణేష్ మార్పు పట్ల సోషల్ మీడియాలో అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

పూర్తిగా మారిన బండ్లన్న..
కరోనా వైరస్‌ను జయించిన అనంతరం బండ్లన్నకు తత్త్వం బోధపడిందట. ఉన్న ఈ ఒక్క జీవితంలో ఎందుకు ఇంత అని అనుకున్నాడట, మనం ఏంటి? మన పని ఏంటి? మన కుటుంబం, పిల్లలు, తల్లిదండ్రులను చూసుకోవాలని, పక్క వారి గురించి ఎందుకని చెప్పుకొచ్చాడు. ఎవరిపైనా నోరు పారేసుకోవద్దని, అందర్నీ ప్రేమించాలి,గౌరవించాలని పేర్కొన్నాడు.

పవర్ స్టార్ ట్రైలర్..
ఆర్జీవీ తీసిన పవర్ స్టార్ ట్రైలర్‌ను బండ్ల గణేష్ లైక్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయంపై నేరుగా అతడినే ప్రశ్నించారు ఫ్యాన్స్. దేవుడు అని అంటామ్ మళ్లీ ఆ పవర్ స్టార్ ట్రైలర్‌ను ఎందుకు లైక్ చేశావ్ అని బండ్లను ప్రశ్నించారు. దీంతో తప్పు తెలుసుకున్న బండ్ల గణేష్ సారీ చెప్పాడు.

ఇంకెప్పుడు ఇలా చేయను..
ఫ్యాన్స్ అలా నిలదీసేసరికి బండ్ల గణేష్ బహిరంగంగా క్షమాపణ చెప్పాడు. సారీ కావాలని అలా చేయలేదు.. తప్పైంది, క్షమించండి, ఇంకెప్పుడు ఇలా చేయను, అయినా నేనేంటే నాకు తెలుసు అంటూ ఫ్యాన్స్ వేడుకున్నాడు. ఇక ఈ ఘటనపై ఓ మీడియాతో మరోసారి క్లారిటీ ఇచ్చాడు.

అది కూడా తెలీదు..
తనకు టెక్నాలజీ మీద అంత పరిజ్ఞానం లేదని, ట్విట్టర్ అలా చూస్తూ వెళ్తుంటే లైక్ కొట్టినట్టు పడిందని చెప్పుకొచ్చాడు. అది చూసిన ఫ్యాన్స్ తనను నిలదీశారని, వారికి క్షమాపణ చెప్పానని పేర్కొన్నాడు. అయితే అది అలాగే ఉంచానని, తనకు డిస్ లైక్ కొట్టడం, కొడితే అది మళ్లీ పోతుందని తెలీదని చెప్పుకొచ్చాడు. ఆపై తన పక్కన ఉన్నవారు మళ్లీ లైక్ కొడితే అది పోతుందని చెప్పారని, ఆపై దాన్ని డిస్ లైక్ చేశానని క్లారిటీ ఇచ్చాడు. పాపం వాటిపై పరిజ్ఞానం లేకనే అలా చేశాడట మన బండ్లన్న.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here