అయ్యో అనిపించేలా పావలా శ్యామల పరిస్థితి.. తిండి కూడా లేదాయె

0
27

తణుకు బెళుకు తారలు.. తారా లోకం గమ్మత్తుగా ఉంటుంది. కానీ.. అందులోని వాస్తవాన్ని చూస్తే.. జీర్ణించుకోవటం కష్టం. సినిమాల్లో పేరు ప్రఖ్యాతులు రాగానే సరిపోదు. తీవ్రమైన ఆర్థిక కష్టాలను అధిగమించటం అందరికి సాధ్యం కాదు. సినిమా కష్టాల్ని తలపించేలా ఇబ్బందులకు గురవుతోంది సీనియర్ నటి పావలా శ్యామలా. దాదాపు 250కు పైగా చిత్రాల్లో నటించిన ఆమె.. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రస్తుతం ఆమె పీకల్లోతు ఆర్థిక సమస్యల్లో ఉన్నారు. ఒకవైపు కుమార్తె అనారోగ్యం.. మరోవైపు ఆర్థిక సమస్యలు ఆమెను తెగ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.

తెర మీద నటనతో ఎన్నో అవార్డులు.. పురస్కారాలు అందుకున్న ఆమె.. జానెడు పొట్టను పోషించుకోవటానికి తనకు వచ్చిన అవార్డుల్ని అమ్మేసుకున్నారు. చివరకు ఇంటి అద్దె కూడా కట్టలేని దీనమైన స్థితిలో ఆమె ఉన్నారు. గతంలో ఆమెకు తెలంగాణ ప్రభుత్వం నెలకు రూ.10వేలు చొప్పున పెన్షన్ వచ్చేలా సాయం చేశారు. అయితే.. తాజాగా ఆ పెన్షన్ కూడా సరిగా రాని పరిస్థితి.

దీంతో.. ఆమె మరింత ఇబ్బందుల్లో ఉన్నారు. గడిచిన మూడు నెలలుగా ఇంటి అద్దెను కట్టలేని దీన స్థితిలో ఉన్న ఆమెను పెద్ద మనసున్న వారు ఆదుకోవాలని కోరుతున్నారు. శ్యామల ఆర్థిక పరిస్థితి అయ్యో అనిపించేలా ఉండటమే కాదు.. ఆమె కష్టాలకు పుల్ స్టాప్ పడేలా సినీ పెద్దలు చర్యలు తీసుకుంటే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here