అమ్మో అభిజిత్ ఫైర్ మీదున్నాడే.. అఖిల్, మోనాల్ మళ్లీ ఇరుక్కున్నారు!!

0
4

బిగ్‌బాస్ షోలో ఆరో వారం వేడెక్కించేందు నాగార్జున దిగాడు. ఈ వారంలో జరిగిన ఒక్కో ఘటన లెక్కలు తీస్తున్నాడు. ముఖ్యంగా మోనాల్ అభిజిత్ అఖిల్‌లపై నాగార్జున పడ్డాడు. ఈ ముగ్గురిపై నాగార్జున ప్రత్యేకంగా శ్రద్ద పెట్టినట్టు కనిపిస్తోంది. అసలే ఈ ముగ్గురి మధ్య దూరం బాగా పెరిగింది. మోనాల్ అభిజిత్ పూర్తిగా దూరంగా ఉంటున్నారు.. ఇక సంచాలక్‌గా అభిజిత్ వేస్ట్ అంటూ నామినేట్ చేసేశాడు అఖిల్. ఈ విషయాలన్ని నాగ్ ప్రస్తావించాడు.

నిప్పు మంచు ఓర్పు..

ఐదో వారం కెప్టెన్సీ టాస్క్‌ కింద నిప్పు చేతిలో మంచు మధ్యలో ఓర్పు అనే టాస్క్‌కు అభిజిత్ సంచాలక్‌గా ఉన్న సంగతి తెలిసిందే. అందులో అఖిల్, అవినాష్, సోహెల్ పార్టిసిపేట్ చేశారు. అయితే ఇందులో అఖిల్ ముందుగా టాస్క్ విరమించాడు. కానీ సంచాలక్‌గా అభిజిత్ సరైన న్యాయం చేయలేదన్న నెపంతో అఖిల్ నామినేట్ చేశాడు. మిగిలిన ఇద్దరిలో ఒకరు టచ్ అయ్యారని అఖిల్ ఆరోపిస్తున్నాడు కానీ ఎవరో చెప్పడం లేదు.

సంచాలక్ తీర్పే ఫైనల్..

ఎవరు టచ్ అయ్యారో వారి పేరు చెప్పమని నాగార్జున ముందే అఖిల్‌ను అడిగాడు అభిజిత్. అది నేను ఎందుకు చెబుతాను.. అంటూ మళ్లీ అదే పాట పాడాడు. అయితే నాగార్జున మాత్రం మండిపడ్డాడు. సంచాలక్ చెప్పిందే ఫైనల్ అంటూ అఖిల్‌కు వార్నింగ్ ఇచ్చాడు. మరి ప్రోమోలో ఇలా ఉంది గానీ ఎపిసోడ్‌లో ఎలా ఉంటుందో చూడాలి.

మోనాల్-అభిజిత్ ఇష్యూ..

మోనాల్ అభిజిత్ మాట్లాడుకుని వారం రోజులు అవుతోంది. గత వారం జరిగిన గొడవతో ఇద్దరూపూర్తిగా దూరమయ్యారు. తన దగ్గర ఒక మాట.. నాగార్జున దగ్గర ఒక మాట చెప్పడంతో అభిజిత్ ఫీల్ అయ్యాడు. ఇలా మాట మార్చడంతో అభిజిత్ హర్ట్ అయి.. మోనాల్‌కు దూరంగా ఉండిపోయాడు.

నాగ్ మళ్లీ అట్టించాడు.

అభిజిత్ మోనాల్ విషయాన్ని నాగార్జున మళ్లీ ప్రస్థావించినట్టున్నాడు. అయితే మోనాల్ అక్కడో మాట ఇక్కడో మాట చెప్పడంపై కంప్లైంట్ చేశాడు.. మోనాల్‌ను నాగ్ ముందే ఎండగట్టేశాడు అభిజిత్. నువ్ మెహబూబ్‌తో మాట్లాడావా? లేదా అంటూ ప్రశ్నించడంతో మోనాల్ బిత్తరపోయింది. మొత్తానికి ఈ రోజు మాత్రం కొన్ని విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

అమ్మ రాజశేఖర్ అలా..

టాస్క్ కోసం అరగుండు కొట్టించుకోని అమ్మ రాజశేఖర్ వచ్చే వారం సేవ్ అయ్యే అవకాశం ఇస్తానంటే మాత్రం రెడీ అయ్యాడు. అమ్మ కోసం కూడా గుండు చేయించుకోని మాస్టర్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవడం కోసం ముందుకు వచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here