అమ్మడికి వకీల్ సాబ్ బాగా హెల్ప్ చేశాడు..!

0
18

‘మల్లేశం’ సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైన తెలుగమ్మాయి అనన్య నాగెళ్ల. ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ఈ తెలంగాణా పిల్ల ఆ తర్వాత ‘ప్లే బ్యాక్’ అనే సినిమాలో నటించింది. ఇదే క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’ లో నటించే అవకాశం దక్కించుకుని అందరి దృష్టినీ ఆకర్షించింది.

‘వకీల్ సాబ్’ సినిమాలో తన పనేదో తన చూసుకునే అమ్మాయిలా ఇన్నోసెంట్ పాత్రలో నటించిన అనన్య నాగేళ్ల మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇంకా తన క్యూట్ స్మైల్ తో కుర్రకారు మనసు దోచుకుంది. ఈ సినిమా ఎవరెవరికి లాభం తెచ్చిపెట్టిందో తెలియదు కానీ అనన్యకు మాత్రం ఫుల్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ తెలుగు అందానికి ఆఫర్లు మీద ఆఫర్లు వస్తున్నాయని క్యాస్టింగ్ వర్గాలు చెబుతున్నాయి.

టాలీవుడ్ లో తక్కువ బడ్జెట్ లో కంటెంట్ బేస్డ్ సినిమాలు తీసే ఫిల్మ్ మేకర్స్ అందరూ అనన్య నాగేళ్ల కోసం తెగ వెతుకుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్న అనన్య స్వయంగా వెల్లడించింది. బబ్లీ క్యారెక్టర్స్ చేయాలని ఆశ పడుతున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత ఫర్మార్మెన్స్ ఓరియెంటెడ్ మూవీస్ కు ప్రిపరెన్స్ ఇస్తానని చెబుతోంది. సినిమా నచ్చితే నటించడానికి హద్దులేం పెట్టుకోలేదని.. ఇలాగే కనిపించాలనే రూల్స్ నాకు లేవని హీరోయిన్ అనన్య నాగేళ్ల స్టేట్మెంట్ ఇస్తోంది. ప్రస్తుతం వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఈ బ్యూటీ రాబోయే రోజుల్లో క్రేజీ హీరోయిన్ గా మారుతుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here