‘అమీర్ కు.. నాకు మధ్య పుల్ల వేసింది వాళ్లేః ఆర్జీవీ

0
28

తనకు అనిపించింది చెప్పడానికి.. ఎవరిని ఏమైనా అనడానికి అస్సలు సంకోచించని వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఈ క్రమంలో ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువయ్యాడు. ఇంకెందరితోనో వైరం పెంచుకున్నాడు. అయినా.. అవన్నీ లైట్ అంటూ కొట్టిపారేస్తాడు. అయితే.. ఓ సారి మాత్రం తాను ఏమీ అనకుండానే అమీర్ ఖాన్ వంటి స్టార్ ను పెద్ద మాట అన్నట్టు ప్రచారం జరిగిందట. దీంతో.. ఆర్జీవీని దూరం పెడుతూ వచ్చాడట అమీర్ ఖాన్.

తెలుగులో ‘శివ’తో ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న ఆర్జీవీ.. తన టాలెంట్ ను బాలీవుడ్ వరకు విస్తరించాడు. ఆ విధంగా 1995లో హిందీలో తీసిన మూవీ ‘రంగీలా’. జాకీ ష్రాఫ్ ఊర్మిళ నటించిన ఈ సినిమాలో అమీర్ ఖాన్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం నమోదు చేసింది.

అయితే.. ఈ సినిమా తర్వాత అమీర్ కు ఆర్జీవీకి మధ్య విభేదాలు తలెత్తాయనే ప్రచారం జరిగింది. దీనికి కారణం ఏమంటే.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమీర్ ను తక్కువ చేశాడట ఆర్జీవీ! ఈ విషయం అమీర్ వరకూ చేరడంతో.. ఆర్జీవీని బ్లాక్ చేశాడట మిస్టర్ పర్ఫెక్ట్. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయం వెల్లడించాడు వర్మ.

వాస్తవంగా జరిగింది వేరేనట. రంగీలా చిత్రంలోని ఓ కీలక సన్నివేశంలో.. సహ నటుడి టైమింగ్ తో అమీర్ ఖాన్ డైలాగ్ డెలివరీ బాగా వచ్చిందని చెప్పాడట వర్మ. కానీ.. తెల్లారి పేపర్లో అది మొత్తం రాయలేదట. అమీర్ కన్నా వెయిటర్ ప్రదర్శన బెటర్ అనే హెడ్డింగ్ తో వార్త వేసేశారట. ఇది చూసిన అమీర్ నొచ్చుకున్నాడట.

అప్పట్లో మొబైల్ ఫోన్లు లేవు కాబట్టి.. తామిద్దరం అసలు విషయం వెంటనే మాట్లాడుకోలేకపోయామని చెప్పాడు. ఆ తర్వాత ఓ రోజు కలిసిన సమయంలో ఏం జరిగిందన్నది మాట్లాడుకున్నారట. ఆ విధంగా తమ మధ్య పుల్ల వేసింది మీడియానే అని ఇండైరెక్ట్ గా చెప్పేశాడు వర్మ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here