అబ్బాయిని చూడమంటే.. అతనే పెళ్లిచేసుకున్నాడు

0
22

ఐటమ్ బాంబ్ అనగానే ముందుగా వినిపించే పేరు ‘రాఖీ సావంత్’. తన పెర్ఫార్మెన్స్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. ఈ మధ్యనే పెళ్లి చేసుకొని ఫ్యాన్స్ ను నిరాశకు గురిచేసింది. అయితే.. ఉన్నట్టుండి సంసార జీవితంలోకి అడుగుపెట్టి మిగిలినవారినీ ఆశ్చర్యానికి గురిచేసింది రాఖీ. అయితే.. దాని వెనుక పెద్ద రీజనే ఉందని రీ-సెంట్ గా బాంబు పేల్చింది ఐటమ్ బ్యూటీ.

బ్రిటన్ కు చెందిన రితేశ్ అనే బిజినెస్ మెన్ వేలు పట్టుకొని ఏడడుగులు వేసింది రాఖీ సావంత్. హడావిడిగా పెళ్లి చేసుకున్న కొన్ని నెలల తర్వాత దానికి గల కారణమేంటో లేటెస్ట్ ఇంటర్వ్యూలో వెల్లడించింది. గుజరాత్ కు చెందిన ఓ మాఫియాడాన్ వల్లే అర్జంటుగా పెళ్లి పీటలు ఎక్కాల్సి వచ్చిందట!

సదరు మాఫియా డాన్ తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టాడట. ఇదే విషయమై నిత్యం వేధిస్తున్నాడట. అయితే.. గతంలో అతనితో డేటింగ్ కు గోవా వెళ్లిందట రాఖీ. ఆ సమయంలో అతని ఫోన్ చూసిన రాఖీకి మైండ్ బ్లాంక్ అయ్యిందట. ఆ ఫోన్లో.. ఓ వ్యక్తిని చావగొడుతూ కనిపించాడట సదరు మాఫియా డాన్.

దీంతో.. అప్పటి నుంచి అతన్ని దూరం పెడుతూ వచ్చిందట. కానీ.. తననే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టాడట సదరు రియల్ విలన్. దీంతో.. అతన్నుంచి తప్పించుకోవడానికి అర్జెంటుగా పెళ్లిచేసుకోవాలని ఫిక్స్ అయ్యిందట.

ఆ సమయంలో రితేశ్ పరిచయం అయ్యాడట. తాను వెంటనే పెళ్లి చేసుకోవాలని మంచి అబ్బాయిని వెతికి పెట్టమని కోరిందట. కానీ.. చివరకు అతనే పెళ్లికొడుకు అయ్యాడని చెప్పింది రాఖీ. ఆ విధంగా డాన్ నుంచి తప్పించుకునే క్రమంలో రితేశ్ తో ఒక్కటయ్యానని ప్రస్తుతం తమ లైఫ్ హ్యాపీగా సాగిపోతోందని చెప్పింది రాఖీ సావంత్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here