అనుష్క శర్మను నిద్రపోనివ్వని బుడ్డోడు.. అర్ధరాత్రి కూడా డిస్టర్బ్ చేస్తూ.. వైరల్ పోస్ట్

0
11

బాలీవుడ్ నటి, విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ తోనే బిజీబిజీగా గడుపుతున్నారు. ఇక కూతురు పుట్టిన అనంతరం ఆమె మరింత బిజీగా మారిపోయింది. సోషల్ మీడియాలో కూడా ఆమె ఎక్కువగా కనిపించడం లేదు. అప్పుడప్పుడు మాత్రమే తన అనుభవాలను పంచుకుంటున్నారు. ఇక ఇటీవల అనుష్క శర్మ పోస్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ స్టోరీ వైరల్ అయ్యింది. ఒక చిన్నోడి వల్ల ఆమె సరిగ్గా నిద్ర కూడా పోవడం లేదట. ఆ బుడ్డోడు నిద్రలో కూడా డిస్టర్బ్ చేస్తున్నాడట.

కూతురు పుట్టిన తరువాత..

ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన అనుష్క శర్మ అనంతరం విరాట్ కోహ్లీతో డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తరువాత కూడా సినిమాలు చేసుకుంటూ వచ్చింది. ఇక ఈ ఏడాది జనవరిలో పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. కూతురికి వమికా అని పేరు పెట్టుకున్న విషయం తెలిసిందే. కూతురి పుట్టిన తరువాత విరుష్క ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని చూస్తున్నారు.

నిద్రలో కూడా అతని పాటే

ఇక సోషల్ మీడియాలో సామాజిక అంశాలతో పాటు అప్పుడప్పుడు సరదా పోస్టులు కూడా చేసే అనుష్క శర్మ ఇటీవల ఒక చిన్నోడి కారణంగా సరిగ్గా నిద్ర కూడా పోవడం లేదట. సరిగ్గా నిద్రపోయే సమయానికి అతను పాడిన పాట గుర్తుకు వస్తోందట. ఆ విషయాన్ని అనుష్క నవ్వుతూ వివరణ ఇచ్చింది.

‘బచ్ పన్ కా ప్యార్ హై’

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా ‘బచ్ పన్ కా ప్యార్ హై’ అనే పాట వైరల్ గా మారింది. చత్తిస్ ఘడ్ లోని హాస దేవ్ అనే పిల్లాడు స్కూల్ తరగతిలో పాడిన ఆ పాట నేషనల్ వైడ్ గా వైరల్ అయ్యింది. సాదారణ జనాల నుంచి బడా సెలబ్రెటీల వరకు కూడా ఈ పాటను రీల్స్ గా చేస్తున్నారు.

విరుష్క పోస్ట్ వైరల్

ఇక ఇటీవల అనుకోకుండా అనుష్క శర్మ కూడా ఆ పాటను వినిందట. ఇక విన్నప్పటి నుంచి పడుకునే సమయంలో కూడా పాట గుర్తుకు వస్తుందట. ఆ విషయాన్ని సరదాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. దీంతో ఆ పోస్ట్ కూడా వైరల్ గా మారింది. ఇక విరుష్క కూతురికి సంబంధించిన ఫొటోలను ఇంతవరకు సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేయలేదు. కూతురికి సోషల్ మీడియా అంటే ఏమిటో తెలిసే వరకు తనకు ప్రైవసీ ఇవ్వాలని అనుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ ఇదివరకే మీడియాకి క్లారిటీ ఇచ్చాడు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here