అనుష్క మీద మనసు పారేసుకున్న బాలీవుడ్ స్టార్ హీరో..!

0
22

‘సూపర్’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన స్వీటీ శెట్టి అనుష్క.. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించింది. ‘అరుంధతి’ ‘రుద్రమదేవి’ ‘భాగమతి’ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో స్టార్ హీరోల రేంజ్ మార్కెట్ అందుకుందీ బొమ్మాళీ. ఇక పాన్ ఇండియా లెవల్ లో రూపొందిన ‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క. అప్పటి నుంచి సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. భారీ ఆఫర్స్ వచ్చినా ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే అంగీకరిస్తూ వస్తోంది.

అయితే అనుష్క మీద బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ మనసు పారేసుకున్నట్లు బీ టౌన్ వర్గాలు చెబుతున్నాయి. ఎలాగైనా పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న అనుష్క తో నటించాలని రణ్ బీర్ తహతహలాడుతున్నాడట. రణబీర్ ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర’ అనే మూవీ చేస్తున్నాడు. అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషించే ఈ సినిమా మూడు భాగాలుగా రానుంది. ఎలాగూ ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి మూడు భాగాల్లో ఏదొక భాగంలో అనుష్క ను తీసుకుంటే రణబీర్ కోరిక నెరవేరుతుందని బాంబే వర్గాల్లో ఇప్పుడు కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇకపోతే ‘నిశబ్దం’ సినిమా తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకున్న అనుష్క.. యువ హీరో నవీన్ పోలిశెట్టి తో ఓ సినిమా చేయనుందని వార్తలు వస్తున్నాయి. ‘రా రా కృష్ణయ్య’ ఫేమ్ మహేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here