అనన్య పాండే ఇంట తీవ్ర విషాదం.. ఎమోషనల్ అవుతూ సుదీర్ఘ పోస్ట్!

0
17

బాలీవుడ్ భామ, విజయ్ దేవరకొండ కొత్త సినిమా ‘లైగర్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న అనన్య పాండే ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె నానమ్మ నిన్న ముంబైలో కన్నుమూశారు.

నానమ్మ మృతి

బాలీవుడ్ హీరోయిన్ అన‌న్య పాండే నాన‌మ్మ వ‌యోభారం కార‌ణంగా క‌న్నుమూశారు. అనన్య తండ్రి చుంకీ పాండే తల్లి అయిన ఆమెకు 85 సంవత్సరాలు. నిన్న ముంబైలోని స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. తన తల్లి స్నేహలతా పాండేకు చుంకీ పాండే తలకొరివి పెట్టారు. ఇక ఈ అంత్య‌క్రియ‌లకు అన‌న్య‌తో పాటు ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు, పాండే కుటుంబ సభ్యులు హాజ‌ర‌య్యారు. ఇప్పటికే వీటికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చల్ చేస్తున్నాయి.

ఎక్కువ రోజులు బతకరంటే
ఆ సంగతి పక్కన పెడితే అనన్య ఈరోజు ఒక ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. ”శక్తితో విశ్రాంతి తీసుకోండి నా దేవదూత అని పేర్కొన్న ఆమె నానమ్మ జన్మించినప్పుడు వైద్యులు ఆమె గుండె వాల్వ్ కారణంగా కొన్ని సంవత్సరాలు దాటి జీవించరని చెప్పారు, కానీ నా నానమ్మ అది నిజం కాదని నిరూపించారని అన్నారు, ఆమె 85 సంవత్సరాల వయస్సు వరకు ప్రతిరోజూ పని చేసేదని అన్నారు.

లెగ్ మసాజ్ ఇచ్చేది

ఉదయం 7 గంటలకు తన బ్లాక్ హీల్స్ మరియు ఎర్రటి జుట్టుతో పనికి వెళుతుందని, అది చూసి నేను ఇష్టపడే దాన్నిఅని చెప్పుకొచ్చింది. నిజానికి అంతలా ఉత్సాహంగా పని చేయటానికి ఆమె ప్రతిరోజూ నన్ను ప్రేరేపించిందని అన్నారు. ఆమె నా శక్తి మరియు కాంతిని పెంచుకోవడానికి చాలా సహాయ పడిందని దానికి నేను చాలా కృతజ్ఞురాలినని పేర్కొంది. ఆమె పట్టుకోవడానికి మృదువైన చేతులు కలిగి ఉండేదని, ఉత్తమ లెగ్ మసాజ్ ఇచ్చేదని చెప్పుకొచ్చింది.

ఎప్పటికీ మరచిపోలేను

ఇక ఆమె స్వయం ప్రకటిత (రాజకీయంగా ఇది తప్పని) ఒక చేతిని చూసి జాతకం చెప్పే వ్యక్తి అని, నన్ను నవ్వించడంలో ఆమె ఎప్పుడూ విఫలం కాలేదని పేర్కొన్నారు. మీరు మా కుటుంబం యొక్క జీవితమన్న ఆమె మిమ్మల్ని ఎప్పటికీ మరచిపోలేనని, నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం అనన్య ‘లైగర్’ సినిమాతో తెలుగులో ఎంటర్ అవుతున్న విషయం తెలిసిందే.

సినిమాల విషయానికి వస్తే

ఇక `స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన అనన్య పాండే `పతి పత్ని ఔర్‌ వాహ్‌`, `ఖాళీ పీలీ` సినిమాల్లో చిత్రాల్లో నటించింది. తెలుగు, హిందీలో బైలింగ్వల్‌గా రూపొందుతున్న `లైగర్‌` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. ఇందులో విజయ్‌ దేవరకొండ సరసన నటిస్తుందీ భామ. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు శకున్‌ బత్రా చేస్తున్న మరో సినిమాలో నటిస్తోంది.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here