అదే పవన్ కల్యాణ్ పవర్!

0
17

పవన్ కల్యాణ్ కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. ఆయన ఒక కథకు గ్రీన్  సిగ్నల్ ఇవ్వడంతోనే అభిమానుల్లో హడావిడి మొదలవుతుంది. అప్పటి నుంచి ఆ సినిమా థియేటర్లకు వచ్చేవరకూ వాళ్లంతా ప్ర్రతి చిన్న విషయాన్ని పరిశీలిస్తూనే ఉంటారు .. ఫాలో అవుతూనే ఉంటారు. అలాంటి పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చారు. ఆ తరువాత ‘వకీల్ సాబ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇది ఆయన అభిమానులకు సంతోషాన్ని కలిగించిన విషయం.

తాజాగా ‘పరుచూరి పలుకులు’ కార్యక్రమంలో ‘వకీల్ సాబ్’ సినిమాను గురించి పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు.
హిందీలో వచ్చిన ‘పింక్’ సినిమాను .. తమిళంలో వచ్చిన ‘నెర్కొండ పారవై’ సినిమాను అందరూ యూ ట్యూబ్ లో చూసేశారు. రెండు భాషల్లో కొన్ని కోట్లమంది చూసేసిన సినిమాను మళ్లీ తీసి అంతే అద్భుతంగా ఆ సినిమాను ఆడించారు. అంతటి పవర్ పవన్ కల్యాణ్ కి ఉంది గనుకనే ఆయన పవర్ స్టార్ అయ్యారు.

ఈ కథలో ఎవరికీ తెలియనిదీ ఏమీ లేదు. ఏ విషయాన్నీ దాచలేదు .. అందుకు సంబంధించిన ఉత్కంఠ లేదు. అంతా తెలిసి కూడా పవన్ కోసం ఈ సినిమాను చూశారు. ఈ సినిమా సాధించిన విజయాన్ని చూస్తే పవన్ సినిమా కోసం జనం ఎంతగా ఎదురుచూస్తున్నారనేది అర్థమవుతుంది. దురదృష్టవశాత్తు ఈ సినిమా రన్ అవుతున్న సమయంలోనే కరోనా సెకండ్ వేవ్ పెరుగుతూ వచ్చింది. జనం థియేటర్లకు రావడానికి భయపడిపోయారు. జనవరిలోనే ఈ సినిమాను విడుదల చేసి ఉన్నట్టయితే ఈ సినిమా వసూళ్లు మరో స్థాయిలో ఉండేవి” అని చెప్పుకొచ్చారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here