అది జక్కన్న మిస్ చేసుకున్న మంచి కథ

0
14

దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతి సినిమాకు కథను ఆయన తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ అందిస్తూ ఉంటారు అనే విషయం ప్రతి ఒక్కరికి తెల్సిందే. తండ్రి కథలను తనదైన శైలిలో భారీగా తెరకెక్కించడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళికి గుర్తింపు వచ్చింది. కొడుకు కోసం ఎన్నో అద్బుత కథలను విజయేంద్ర ప్రసాద్ రాస్తూ ఉంటారు. ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ కూడా రచయితగా జాతీయ స్థాయి లో గుర్తింపు దక్కించుకున్న వ్యక్తి. ఆయన ఒక రచయితగా పాన్ ఇండియా స్టార్ డమ్ దక్కించుకున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సల్మాన్ ఖాన్ నటించిన భజరంగీ భాయ్ జాన్ సినిమా కు కథను విజయేంద్ర ప్రసాద్ అందించాడు.

ఆ కథతో ఒక్కసారిగా విజయేంద్ర ప్రసాద్ బాలీవుడ్ లో స్టార్ అయ్యాడు. అంతకు ముందు ఎన్నో సినిమాలకు కథలను అందించినా కూడా విజయేంద్ర ప్రసాద్ కు అక్కడ స్టార్ డం వచ్చింది మాత్రం ఈ సినిమాతోనే అనడంలో సందేహం లేదు. అంతటి స్టార్ డమ్ ను విజయేంద్ర ప్రసాద్ కు తీసుకు వచ్చిన భజరంగి భాయిజాన్ సినిమా కథ ను ఆయన తనయుడు రాజమౌళి తిరష్కరించడం విడ్డూరం. కథ రాసుకున్న వెంటనే రాజమౌళికి విజయేంద్ర ప్రసాద్ కథను చెప్పాడట. అయితే ఆ సమయంలో కథ బాగానే ఉంది కాని నేను తీయను అంటూ చేతులు ఎత్తేశాడట. ఆ సమయంలో రాజమౌళి నో చెప్పడం వల్ల సల్మాన్ ఖాన్ కు ఆ సినిమా కథను వినిపించడం.. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించడం జరిగి పోయిందట. సినిమా చూసిన తర్వాత రాజమౌళి తాను ఆ కథను తిరష్కరించి తప్పు చేశాను అంటూ నిరుత్సాహం వ్యక్తం చేశాడట.

బాహుబలి సినిమా షూటింగ్ బిజీలో ఉన్న సమయంలో ఎర్రటి ఎండ లో యుద్ద సన్నివేశాలు తీస్తూ బాగా అలసి పోయి మూడ్ ఆఫ్ లో ఉన్న సమయంలో నేను రాజమౌళికి ఆ కథను చెప్పాను. ఆ సమయంలో అతడు ఉన్న పరిస్థితిని బట్టి కథ నచ్చినా దర్శకత్వం చేయలేను అని చెప్పాడు. ఆ సమయంలో కాకుండా మరే సమయంలో చెప్పినా కూడా రాజమౌళి ఆ కథను చేసేవాడు అంటూ విజయేంద్ర ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. రాజమౌళి ఆ కథను చేసి ఉంటే మరో రేంజ్ లో తెరకెక్కించి ఉండేవాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

విజయేంద్ర ప్రసాద్ ఆ కథ చెప్పిన సమయం సరిగా లేకపోవడం వల్ల రాజమౌళి ఒక మంచి కథ మిస్ చేసుకున్నారు అంటూ కొందరు నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయినా జక్కన్న ఆ కథను మిస్ చేసుకున్నా ఏ కథను తీసుకున్నా కూడా అద్బుతాన్ని ఆవిష్కరిస్తాడు అనడంలో సందేహం లేదు. కనుక ఆ కథ మిస్ అయ్యిందనే బాధ అక్కర్లేదు అనేది కొందరి అభిప్రాయం. ప్రస్తుతం జక్కన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ను తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమా అక్టోబర్ లో విడుదల కాబోతుంది. ఆ తర్వాత మహేష్ బాబు తో సినిమాను ప్రారంభించబోతున్నాడు. దానికి కథ కోసం విజయేంద్ర ప్రసాద్ పెన్ను పెట్టారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here