అత్యంత విషమంగా జర్నలిస్ట్ TNR ఆరోగ్యం?

0
23

కోవిడ్ ఎవరినీ విడిచిపెట్టడం లేదు. సామాన్యుడు మాన్యుడు జర్నలిస్ట్ సెలబ్రిటీ అనే విభేధం అస్సలు లేదు. గంటగంటకో ప్రముఖుని మరణం గురించి వినాల్సి రావడం బాధాకరం. ప్రణాంతక వైరస్  ఎందరో జర్నలిస్టుల్ని పొట్టన పెట్టుకుంటోంది. సెకండ్ వేవ్ లో చాలా మంది జర్నలిస్టులు తుది శ్వాస విడిచారు.

ప్రస్తుతం ఆస్పత్రిలో విషమంగా ఉన్న మరో జర్నలిస్ట్ గురించి కథనాలు సంచలనంగా మారాయి. టి.ఎన్.ఆర్.గా పాపులరైన తుమ్మల నరసింహా రెడ్డి హైదరాబాద్ కాచిగూడ(నాంపల్లి)లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో కరోనాకు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అతని పల్స్ రేటు బాగా పడిపోయింది. వెంటిలేటర్ పై చికిత్స సాగుతోందని సెమీ కోమా స్థితిలో ఉన్నారని తెలిసింది. టి.ఎన్.ఆర్ సన్నిహితుడు ఒకరు ఫేస్ బుక్ ప్రొఫైల్ లో ఈ విషయం వెల్లడించారు. టీ.ఎన్.ఆర్ దాదాపు కోమా దశలో ఉన్నారని శ్రీనివాస్ పేర్కొన్నారు. త్వరగా కోలుకునేలా ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని ఆయన కోరారు.

గత నెల జర్నలిస్ట్ టీ.ఎన్.ఆర్ సోదరికి వైరస్ సోకగా ఆమె చికిత్సతో బయటపడ్డారు. వెంటిలేటర్ పై ఉంచి చికిత్స చేయగా ఆమె కోసం ప్రార్థించాలని టీ.ఎన్.ఆర్ ఎంతో ఆవేదనగా కోరారు. కొన్నాళ్లకు ఆమె కోలుకున్న విషయాన్ని అతడు సోషల్ మీడియాల్లోనే వెల్లడించారు. ఇప్పుడు టీ.ఎన్.ఆర్ పరిస్థితి విషమంగా ఉందన్న వార్త కలచివేస్తోంది. టీఎన్ ఆర్ జర్నలిస్టుగానే కాదు నటుడిగానూ బిజీ. తాను నటించే సినిమాల వివరాల్ని సోషల్ మీడియాల్లో వెల్లడిస్తుంటారు. ఇటీవల కరోనాతో మృతి చెందిన దర్శకుడు శ్రావణ్ కి ఆయన సంతాపం తెలిపారు. కానీ ఇప్పుడు ఆయన అనారోగ్యంతో వెంటిలేటర్ పై ఉన్నారు. ఈ స్థితిలో జర్నలిస్ట్ TNR వీలైనంత త్వరగా కోలుకోవాలని తిరిగి పనిలో చేరాలని ప్రార్థిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here