అతనితో ప్రేమలో పడ్డాను కానీ.. బ్రేకప్ పై క్లారిటీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్

0
9

సినిమా ప్రపంచంలో సినీ తారల ప్రేమ విషయాలు ఏ రేంజ్ లో వైరల్ అవుతాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే వాళ్లలో ఎక్కువ కాలం కొనసాగే బంధాలు చాలా తక్కువ. కాస్త తేడా వచ్చినా కూడా బ్రేకప్ చెప్పేస్తుంటారు. కొందరైతే పెళ్లి వరకు వెళ్లి వెనుకడుగు వేశారు. అయితే అనుపమ పరమేశ్వరన్ జీవితంలో కూడా అలాంటి స్టోరీ ఉందట. ఆమె బ్రేకప్ పై ఒక క్లారిటీ కూడా ఇచ్చేసింది.

తొందరగానే కనెక్ట్ అయ్యింది

మలయాళం ఇండస్ట్రీలో ప్రేమమ్ సినిమాతో అమ్మడు స్టార్ హీరోయిన్స్ లెవెల్లో క్రేజ్ అందుకుంది. తెలుగు జనాలకు కూడా చాలా తొందరగానే కనెక్ట్ అయ్యింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన అఆ సినిమా అనుపమకు మంచి బ్రేక్ ఇచ్చింది. అనంతరం వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా మీడియం సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంటూ వచ్చింది.

ప్రేమలో ఉన్నట్లు రూమర్స్

ఇక అనుపమ కెరీర్ లో ప్రేమకు సంబంధించిన అంశాలు ఉన్నట్లు ఇటీవల సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇవ్వడం వైరల్ గా మారింది. రూమర్స్ ఎన్ని వచ్చినా కూడా అనుపమ పెద్దగా పట్టించుకోదు. కానీ గతంలో ఆమె ఒక క్రికెటర్ తో ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. ఆ క్రికెటర్ కు ఇటీవల పెళ్లి అయిపోయింది.

గతంలో నేను ప్రేమలో పడ్డాను

ఇక సడన్ గా బ్రేకప్ గురించి ఎదురైన ప్రశ్నకు సమాధానం చెప్పడంతో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అవును గతంలో నేను ప్రేమలో పడ్డాను. ఓ వ్యక్తిని ప్రేమించడం జరిగింది. కానీ బ్రేకప్ అయిపోయింది.. అంటూ అనుపమ చాలా సింపుల్ గా క్లారిటీ ఇచ్చేసింది. దీంతో అతను క్రికెటర్ అయ్యి ఉండవచ్చని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

కేవలం సెట్టయ్యే కథలకు మాత్రమే..

ఇక అనుపమ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె కార్తికేయ, రౌడి బాయ్స్, 18 పేజెస్ వంటి విభిన్నమైమ సినిమాల్లో నటించింది. ఇక చివరగా ఆమె బెల్లంకొండ రాక్షసుడు సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఆఫర్స్ కూడా బాగానే వస్తున్నాయి. అయితే అనుమప మాత్రం కేవలం తనకు సెట్టయ్యే కథలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here