అడిగిన 10 నిమిషాల్లోనే సాయం.. సూపర్ హీరో సోనూసూద్

0
24

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రతి రోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. దేశంలో ప్రస్తుతం ఆక్సీజన్ కొరత భారీగా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సీజన్ కొరత నేపథ్యంలో దాతలు ముందుకు వచ్చి సాయం చేస్తున్నారు. ఆసుపత్రుల్లో ఆక్సీజన్ కొరత కారణంగా ఇప్పటికే పదుల సంఖ్యలో జనాలు మృతి చెందారు. ఈ సమయంలో సోనూసూద్ చేస్తున్న సాయం అంతా ఇంతా కాదు. దేశ వ్యాప్తంగా ఆయన పేరు ప్రస్తుతం మారు మ్రోగిపోతుంది. గత ఏడాది ఆరంభం లో లాక్ డౌన్ తో ఇబ్బంది పడ్డ వలస కార్మికులకు సాయం చేయడం నుండి మొదలుకుని ఇప్పుడు ఆక్సీజన్ సిలిండర్ల సరఫరా వరకు సోనూసూద్ చేస్తున్న మంచి పనిని అందరు అభినందిస్తూనే ఉన్నారు.

తాజాగా మరోసారి సోనూసూద్ తన మంచి మనసు చాటుకున్నాడు. ప్రముఖ క్రికెటర్ సురేష్ రైనా ట్విట్టర్ లో మీరట్ లో ఉన్న తన ఆంటీకి అర్జంట్ గా ఆక్సీజన్ అవసరం ఉంది అంటూ ట్వీట్ చేశాడు. రైనా ట్వీట్ కు వెంటనే స్పందించిన సోనూ సూద్ ఆమెకు సంబంధించిన డీటైల్స్ ను పంపించాల్సిందిగా కోరాడు. ఆ తర్వాత వెంటనే 10 నిమిషాల్లోనే ఆక్సీజన్ ను సోనూసూద్ టీమ్ మీరట్ లో ఉన్న రైనా ఆంటీకి అందించడం జరిగింది. జెట్ స్పీడ్ తో సోనూ సూద్ సాయం చేయడంను ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు.

సోనూసూద్ ను రియల్ హీరో అంటూ అంతా అభినందిస్తున్నారు. ఈ సమయంలోనే సోనూసూద్ చాలా స్పీడ్ గా సాయం అందించి ప్రాణాలు కాపాడుతూ సూపర్ హీరో అవుతున్నాడు. ఏ ప్రభుత్వాలు చేయలేని పనిని సోనూసూద్ చేస్తున్నాడు అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సోనూసూద్ కొన్ని వందల ప్రాణాలను కాపాడుతున్నాడు. ఆక్సీజన్ సిలిండర్లను వందలకు వందలు వివిధ ప్రాంతాలకు పంపిస్తూ అందరికి అందుబాటులో ఉండేలా చూస్తున్నాడు. నిజంగా ఈ సమయంలో సోనూసూద్ దేవుడు అనడంలో సందేహం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here