అఖిల్ విషయంలో నాగ్ ఫెయిల్.. అందుకే రామ్ చరణ్ సెట్ చేస్తున్నాడా..?

0
9

సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలి బ్యాక్ గ్రౌండ్ అనేది కేవలం కొంత వరకు మాత్రమే ఉపయోగపడుతుందనేది అసలైన వాస్తవం. ఫైనల్ గా ఎలాంటి హీరో అయినా సరే ఆడియెన్స్ కి నచ్చితేనే సినిమా ఇండస్ట్రీలో ఉంటాడు. ఇక అక్కినేని ఫ్యామిలీలో హీరోల సక్సెస్ రేట్ చాలా తక్కువ అయినప్పటికీ ఎవరికి వారు మంచి గుర్తింపును అందుకున్నారు. ఇక అఖిల్ మాత్రం సరైన బాక్సాఫీస్ హిట్ దక్కడం లేదు.

అప్పుడే ఊహించని దెబ్బ తిన్నాడు

అఖిల్ అందం చూసి మొదటి సినిమాతోనే మనోడు ఇరగదీస్తాడు అని అంతా అనుకున్నారు. కానీ అప్పుడే ఊహించని దెబ్బ తిన్నాడు. ఆ తరువాత నాగార్జున స్పెషల్ కేర్ తీసుకొని కొడుకు కెరీర్ కోసం ఏడాది పాటు ప్రత్యేక దృష్టి పెట్టారు. కష్టపడి అఖిల్ హలో సినిమా తీస్తే ఆ సినిమా కూడా బేడిసికొట్టింది.

సక్సెస్ లేని దర్శకుడితో..

ఫైనల్ గా అఖిల్ మూడు సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి. ఒక విధంగా నాగార్జున అఖిల్ విషయంలో ఎంతగానో ఆలోచించాడు. కానీ వర్కౌట్ కాలేదు. ఇక చివరికి అల్లు అరవింద్ చేతిలో పెట్టగా ఆయన వెళ్లి బొమ్మరిల్లు భాస్కర్ చేతిలో పెట్టడం మరో ఆశ్చర్యకరమైన విషయం. సక్సెస్ లేని దర్శకుడితో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను పూర్తి చేసి రిలీజ్ కి రెడీగా ఉంచిన అఖిల్ ఆ సినిమాతో ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడు అనేది పెద్ద మిస్టరీగా మారింది.

అఖిల్ బాధ్యతపై చరణ్ స్పెషల్ ఫోకస్

ఇక ఫైనల్ గా అఖిల్ బాధ్యతను రామ్ చరణ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సురేందర్ రెడ్డి చరణ్ కి క్లోజ్ కావడంతో అఖిల్ కోసం మంచి మాస్ కథను రెడీ చేయాలని రిక్వెస్ట్ చేశాడట. సైరా లాంటి పాన్ ఇండియా సినిమా తరువాత మరో పెద్ద హీరోతో వర్క్ చేయాలని అనుకున్న సురేందర్ చరణ్ రిక్వెస్ట్ కి నో చెప్పలేకపోయాడు.

అఖిల్ సురేందర్. ఒక స్పై థ్రిల్లర్

మొత్తానికి అఖిల్ కోసం స్పై థ్రిల్లర్ సినిమాను రెడీ చేసినట్లు టాక్ వస్తోంది ఇటీవల సినిమాకి సంబంధించిన అఫిషియల్ ఎనౌన్స్మెంట్ కూడా వచ్చింది. మొత్తంగా సినిమాకు సంబంధించిన ఫుల్ స్క్రిప్ట్ రేడీ అయిన తరువాతే సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. మరి రామ్ చరణ్ సెట్ చేసిన ఆ కథ అఖిల్ కి ఎంతవరకు సక్సెస్ ఇస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here