అక్కినేని జోడీ నికర ఆస్తుల విలువ ఎంత?

0
31

సమంత అక్కినేని – నాగ చైతన్యల సంయుక్త నికర ఆస్తుల విలువ ఎంత? టాలీవుడ్ ఉత్తమ జంటగా సమంత – చైతన్య క్షణం తీరిక లేని షెడ్యూళ్లతో ఆర్జిస్తున్నారు. సినిమాలు  ప్రకటనలతో కోట్లలో సంపాదిస్తున్నాయి. వారి మొత్తం నికర ఆస్తుల విలువ కచ్చితంగా  ఆశ్చర్యపరుస్తుంది..!

వివాహానంతరం ఈ జోడీ అనేక ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కెరీర్ లో ఉత్తమ దశలో ఉన్నారు. సామ్ నటించిన ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 సిరీస్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా వేచి చూస్తున్నారు. గుణశేఖర్ శాకుంతలం చిత్రంలో సమంత కథానాయికగా నటిస్తున్నారు. నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ త్వరలో విడుదల కానుంది. కానీ COVID-19 పరిస్థితి కారణంగా విడుదల తేదీ వాయిదా పడింది. ఈ సినిమాతో పాటు విక్రమ్ కుమార్ థాంక్యూలో నటిస్తున్నాడు. తదుపరి కూడా బిగ్ లైనప్ ఉంది.

నాగ చైతన్య అక్కినేని లెగసీని ముందుకు నడిపిస్తున్నాడు. పాపులర్ స్టార్లు ఉన్న కుటుంబం నుండి వచ్చిన స్టార్. అయితే సమంతా తన ట్యాలెంట్ తో ఈ రంగంలో ఒక సముచిత స్థానాన్ని అందుకున్నారు. ఇద్దరూ ఇప్పుడు తమ సినిమాలు .. వాణిజ్య ప్రకటనలు ..డిజిటల్ షోలతో బాగా సంపాదిస్తున్నారు. మునుముందు వెబ్ సిరీస్ లలో నటించే ఆసక్తిని కలిగి ఉన్నారు.

వారి మొత్తం నికర విలువ పరిశీలిస్తే… సామ్ ఆస్తుల విలువ రూ .84 కోట్లు ఉంటుందని సమాచారం. అలాగే రెండు స్టార్టప్ లను కలిగి ఉంది. ఒకటి ఫ్యాషన్ లేబుల్ సాకి .. మరొకటి ఎకామ్ అనే ప్రీ-స్కూల్. పిల్లలకు వినూత్న విద్యను అందించే లక్ష్యంతో ఆమె తన ఇద్దరు భాగస్వాములతో ఈ సంవత్సరం ఈ విద్యా సంస్థను ప్రారంభించారు. తన లగ్జరీ పెట్టుబడులను పరిశీలిస్తే.. సమంత రూ .76 లక్షల విలువైన విలాసవంతమైన బి.ఎమ్.డబ్ల్యూ కారును కలిగి ఉంది. తాజా నివేదికల ప్రకారం సమంత ఒక్కో చిత్రానికి రూ.2 కోట్లు వసూలు చేస్తోంది.

నాగచైతన్యకు వారసత్వ ఆస్తులు వందల వేల కోట్లు అని చెబుతుంటారు. అతడికి లగ్జరీ ఇండ్లు.. గచ్చిబౌళిలో ఇల్లు.. అపార్ట్ మెంట్ లు.. ఖరీదైన కార్లు ఉన్నాయి. అతడు సినిమాలు – ఎండార్స్ మెంట్ లతో.. కోట్లలో సంపాదిస్తున్నాడు. సినీ కెరీర్ లో ఆర్జించినది నికర విలువ 38 కోట్ల రూపాయలు. నాగచైతన్యతో పోలిస్తే సంఖ్యా పరంగా ఎక్కువ సినిమాల్లో నటించిన సమంత రూ .84 కోట్ల సంపాదించారని అంచనా. తెలుగు-తమిళంలో సమంత బిజీ నాయికగా ఆర్జించారు. నాగ చైతన్య ఆర్జనతో సామ్ ఆర్జనను కలిపి మొత్తం రూ .122 కోట్ల వరకు ఉంటుందనే అంచనాను వెలువరిస్తున్నారు.

ఆ ఇద్దరి కెరీర్ ఉత్తమ దశలో ఉన్నందున వారి ఆస్తులు పెరుగుతున్నాయి. ఈ రోజుల్లో యువ తారలు కష్టపడి సంపాదించిన డబ్బును ఎలా ఆదా చేసుకోవాలో దృష్టి సారిస్తున్నారు. స్టార్టప్ ఇతర వ్యాపారాలలో పెట్టుబడులు పెడుతున్నారు. నాగ చైతన్య – సమంత అక్కినేని జంట వ్యాపారంలో కలిసి మెలిసి విజయ సూత్రాన్ని అనుసరిస్తున్నారు.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here