అక్కడ బిజీ అవ్వడం కోసం అందాల ఆరబోత

0
8

తెలుగు ప్రేక్షకులకు ఊహలు గుసగుసలాడే సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశిఖన్నా. ఆ సినిమా సమయంలోనే మల్టీ ట్యాలెంటెడ్ అమ్మాయి అంటూ ఈ అమ్మడిపై విమర్శకుల ప్రశంసలు కురిశాయి. తెలుగు యంగ్ హీరోలు పలువురు ఈమెతో రొమాన్స్ కు ఇంట్రెస్ట్ చూపించారు. కొన్ని సినిమాలు సక్సెస్ అయినా కూడా ఈమెకు ఒక్క ఎన్టీఆర్ తో మినహా ఇతర హీరోలకు జోడీగా నటించే అవకాశం దక్కలేదు. తెలుగు లో ఈ అమ్మడు చాలా ప్రయత్నాలే చేసింది. టాలీవుడ్ లో ఈమె స్టార్ డమ్ ను ఆశించినా అది అందని ద్రాక్ష మాదిరిగా మారింది. దాంతో మెల్లగా ఈమె ఇతర ప్రయత్నాలు మొదలు పెట్టింది.

తమిళంలో ఈ మద్య కాలంలో ఎక్కువగా ఈమె ఫోకస్ పెట్టింది. టాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే అక్కడ బిజీ అయ్యింది. టాలీవుడ్ సినిమాలతో పోల్చితే కోలీవుడ్ సినిమాల్లో ఈ అమ్మడి అందాల ఆరబోత ఎక్కుగా ఉంటుంది. తెలుగులో ఈ అమ్మడు చేసిన సినిమాల్లో ఒకటి రెండు సినిమాల్లో హాట్ గా నటించిన దాఖలాలు ఉన్నాయి. కాని తమిళంలో ఈమె నటిస్తున్న ప్రతి సినిమాలో కూడా అందాల ఆరబోత కుమ్మేస్తోంది.

తాజాగా ఈ అమ్మడు నటించిన తమిళ చిత్రం ఆరణ్మయి 3. ఈ సినిమా లో త్రిష మరియు హన్సికలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరో కీలక పాత్రలో ఈ అమ్మడికి అవకాశం దక్కింది. రాశి ఖన్నా హీరోయిన్ గా కాకున్నా కూడా అందాల ప్రదర్శణ విషయంలో ఆ ఇద్దరు హీరోయిన్స్ మించి ఉంటుందని ఇటీవల విడుదల అయిన పోస్టర్ లను చూస్తుంటే అనిపిస్తుంది. ఆర్యకు జోడీగా నటించిన ఈమెకు ఖచ్చితంగా ఆ సినిమా మంచి సక్సెస్ ను తెచ్చి పెట్టడం ఖాయం.. అలాగే ఆ విజయంతో తమిళంలో మరిన్ని ఆఫర్లు దక్కించుకోవడం ఖాయం అన్నట్లుగా రాశిఖన్నా అభిమానులు ఆశ పడుతున్నారు. తమిళంలో ఈ అమ్మడు మరింతగా రెచ్చి పోయి అందాల ప్రదర్శణ చేస్తే ఖచ్చితంగా ఈమె అక్కడ స్టార్ హీరోయిన్ గా మారడం ఖాయం అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here