అక్కడా .. ఇక్కడా యంగ్ హీరో జాడలేదేం?

0
23

ఆది పినిశెట్టి .. తెలుగులో సీనియర్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి తనయుడు. తెలుగులో తన తండ్రి ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించినప్పటికీ ఆయన పేరు చెప్పుకుని ఎదగడానికి ఆది పినిశెట్టి ప్ర్రయత్నించినట్టుగా ఎక్కడ కనిపించదు. తెలుగు .. తమిళ భాషల్లో తన దగ్గరికి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆయన వస్తున్నాడు. కేవలం హీరోగా మాత్రమే చేస్తానని గిరి గీసుకుని కూర్చోకుండా ముఖ్యమైన పాత్రలను .. విలన్ రోల్స్ ను కూడా చేస్తూ వెళుతున్నాడు.

ఆది పినిశెట్టి మంచి నటుడు .. ఏ పాత్రలో నటన పరంగా ఎంతవరకూ వెళ్లాలనేది ఆయనకి బాగా తెలుసు. ఆ పరిధి దాటకుండా చేయడం వల్లనే ఆయన నటనను ఎక్కువమంది ఇష్టపడతారు. తమిళంలో ఆయన చేసిన ఒక సినిమా తెలుగులో ‘వైశాలి’ పేరుతో విడుదలైంది. ఈ సినిమానే తెలుగు ప్రేక్షకులకు ఆది పినిశెట్టిని మరింత చేరువ చేసింది. ఇప్పటికీ ఈ సినిమా ఎన్నిసార్లు టీవీలో వచ్చినా చూస్తూనే ఉంటారు. ఆ సినిమాలో ఆయన నటన చాలా సహజంగా ఉంటుంది.

‘సరైనోడు’ .. ‘నిన్నుకోరి’ .. రంగస్థలం ‘యూ టర్న్’ సినిమాల్లో ఆది పినిశెట్టి విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేశాడు. ఈ సినిమాలు ఆయనకి విజయంతో పాటు మంచి గుర్తింపును కూడా తెచ్చిపెట్టాయి. అయితే ఎందుకనో ‘యూ టర్న్’ తరువాత ఆయన కెరియర్లో చిన్న గ్యాప్ వచ్చేసింది. ప్రస్తుతం తెలుగు .. తమిళ భాషల్లో ఆయన చేతిలో రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి. మరి ఉన్నట్టుండి రెండు భాషల్లో ఒకేసారి అవకాశాలు తగ్గడానికి గల కారణాలే తెలియడం లేదు. కరోనా కాలం తరువాతనైనా ఆయన తన స్పీడ్ పెంచుతాడేమో చూడాలి.    

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here