అంచనాలు పెంచుతున్న పుష్ప టీజర్.. బరిలోకి స్టార్ ఎడిటర్!

0
23

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా రూపొందుతుంది పుష్ప. ఫస్ట్ టైం బన్నీ పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈసారి సుకుమార్ కూడా పాన్ ఇండియా రేంజిలో సాలిడ్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అయితే ప్రస్తుతం బన్నీ అభిమానుల దృష్టంతా పుష్ప టీజర్ పైనే పడింది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు ఉండటంతో ఈరోజు బర్త్ డే స్పెషల్ గా పుష్ప టీజర్ విడుదల చేయనున్నారు మేకర్స్. ఇటీవలే విడుదల చేసిన ప్రీలోడ్ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. మరిప్పుడు టీజర్ ఎలా ఉండబోతుందో అంటూ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. మరి పుష్ప టీజర్ విషయంలో మైత్రి వారు సుకుమార్ టీమ్ భారీ స్కెచ్ వేసినట్లు టాక్.

ఈరోజు విడుదల చేయనున్న టీజర్ పై అంచనాలు ఓ రేంజిలో నెలకొన్నాయి. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే సుకుమార్ బృందం ఈ సినిమా టీజర్ ఎడిట్ చేయడానికి తమిళ స్టార్ ఎడిటర్ ఆంథోని రూబెన్ ను లైన్ లోకి దింపారు. సూపర్ స్టార్ రజినీకాంత్ దళపతి విజయ్ తలా అజిత్ సినిమాలను ఎడిట్ చేసిన ఆంథోని ఇప్పుడు పుష్ప టీజర్ కట్ చేసాడట. మరి స్టార్ హీరోల సినిమాలకు అద్భుతమైన ఎడిటింగ్ చేకూర్చే ఆంథోని పుష్ప టీజర్ ఎలా రెడీ చేసాడనే ఇంటరెస్ట్ అందరిలో ఆసక్తి రేపుతుంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీడ్రైవర్ పాత్రలో నటిస్తుండగా.. హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తోంది. ఆగష్టు 13న విడుదల కాబోతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here