SR Kalyana Mandapam Movie Download: ఎస్ఆర్ కళ్యాణమండపంపై పైరసీ ఎఫెక్ట్.. ఒక్క క్లిక్కుతో ఫుల్ మూవీ

0
31

గత కొంతకాలంగా టెక్నాలజీ విషయంలో అనేక రకాల మార్పులు వస్తున్నాయి. అయితే ఈ క్రమంలో టెక్నాలజీ కారణంగా ఎంతగా లాభాలు చేకూరుతున్నాయో అదే తరహాలో నష్టాలు కూడా ఎక్కువగానే ప్రభావం చూపిస్తున్నాయి. ఏళ్లు గడుస్తున్నా కూడా సినిమా ఇండస్ట్రీని పైరసీ భూతం ఏమాత్రం వదిలిపెట్టడం లేదు. చాలా మంది సినీ నటులు పైరసీని అరికట్టేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. కానీ ఎంత ప్రయత్నం చేసినా కూడా అది ఒక రోజు పెళ్లి తంతులానే హడావిడిగా కనిపిస్తోంది కానీ సరైన పరిష్కారం మాత్రం దొరకడం లేదు.

సూపర్ స్టార్ నుంచి పవర్ స్టార్ వరకు చాలామంది పైరసీ పై ఎన్నో పోరాటాలు చేశారు. చిన్న సినిమాలపై కూడా పైరసీ భూతం తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తుంది సినిమా విడుదలయిన గంటలోనే సోషల్ మీడియాలో కూడా దర్శనాలు ఇస్తున్నాయి ఇక నేడు విడుదలైన మరో సినిమాకు కూడా పడడం హాట్ టాపిక్ గా మారింది.

ఎస్ఆర్ కళ్యాణమండపం

ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్, సాయి కుమార్, తులసి, అరుణ్ కుమార్ వంటి ప్రముఖ నటి నటులు నటించిన ఈ సినిమా కొంత భారీ స్థాయిలోనే విడుదలైంది. పోటీగా పెద్ద సినిమాలేవీ లేకపోవడం వలన కూడా ఓ వర్గం జనాల దృష్టి ఈ సినిమాపై ఎక్కువగనే పడింది. ఇదివరకే పాటలతో కూడా మంచి హైప్ క్రియేట్ చేశారు.దీంతో సినిమాకు మంచి ఓపెనింగ్స్ అయితే దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా

ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఈ వారం మొత్తం సినిమాకు ఎదురు లేదనే చెప్పాలి. ఎందుకంటే గత వారం విడుదలైన ఇష్క్ , తిమ్మరుసు సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. శని ఆది వారాలు తప్పితే ఆ సినిమాలకు బాక్సాఫీస్ వద్ద సరైన కలెక్షన్స్ రావడం లేదు. ఇక ఇప్పుడు ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాకు పెద్దగా పోటీ లేదు కాబట్టి పాజిటివ్ టాక్ ను బట్టే కలెక్షన్ స్థాయి పెరిగే అవకాశం ఉంది.

పైరసీ భూతం

ఇక సినిమా టాక్ సంగతి పక్కన పెడితే సినిమాకు అప్పుడే పైరసీ భూతం ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. ప్రముఖ పైరసీ వెబ్ సైట్ లలో ఫుల్ సినిమా దర్శనం ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఒకప్పుడు సినిమాలు విడుదలైన రెండు మూడు రోజుల్లో కానీ పైరసీ వీడియోలు అంతగా లీకయ్యే కావు. కానీ ప్రస్తుతం టెక్నాలజీని వాడుకుని కొందరు సినిమా బిజినెస్ పై భారీగా దెబ్బ కొడుతున్నారు. మొదటి షో పడిన అరగంటలోనే సినిమాలు వెబ్ సైట్ లలో ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో మరుసటి రోజు నుంచి ఆ ప్రభావం బాక్సాఫీస్ కలెక్షన్స్ పై గట్టిగానే పడుతుంది. సినిమా ప్రముఖులు పోలీసులు ప్రభుత్వం ఈ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఫలితం దక్కడం లేదు. ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమా కూడా తమిళ్ రాకర్స్, మూవీ రూల్స్, ఐ బొమ్మ వంటి ప్రముఖ పైరసీ వెబ్ సైట్లలో పదుల సంఖ్యలో లింకులు దర్శనమిస్తున్నాయి. ఒక్క క్లిక్కుతో సినిమా మొత్తం డౌన్ లోడ్ అవుతోంది అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

టెలిగ్రామ్ యాప్ లో కూడా

ఓటీటీలో విడుదలైన సినిమాలకు కూడా పైరసీ భూతం ఏమాత్రం వదిలిపెట్టడం లేదు టెక్నాలజీ సెక్యూరిటీ ఉన్నా కూడా సైతం ఈజీగా లాగిస్తున్నారు ముఖ్యంగా టెలిగ్రామ్ యాప్ లలో అయితే సెర్చ్ లో అలా సినిమా పేరు టైప్ చేయగానే డైరెక్ట్ వీడియోలు వచ్చేస్తున్నాయి సోషల్ మీడియా వరకు పైరసీని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న సినిమా నిర్మాతలు ఆన్ లైన్ వెబ్ సైట్స్ లో మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. ఒకవేళ వాటిని బ్లాక్ చేయాలని అని అనుకున్నప్పటికీ వెంటనే మరో పేరుతో మార్పులు చేసి మరొక లింక్స్ ను క్రియేట్ చేస్తున్నారు.

సినిమా టాక్..

టెలిగ్రామ్ లో కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమా విషయానికి వస్తే నేడు విడుదలైన ఈ సినిమాలో సాయికుమార్ ముఖ్యమైన పాత్రలో కనిపించారు రాజావారు రాణి వారు అనంతరం కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ సినిమా పాటలతోనే మంచి హైప్ క్రియేట్ చేసింది. ప్రస్తుతానికైతే భిన్నమైన టాక్ తో సినిమా కొనసాగుతోంది. ఒకసారి చూడవచ్చని సోషల్ మీడియాలో నెటిజన్లు రివ్యూలు ఇస్తున్నారు. సినిమా మాత్రం తప్పకుండా అందరి మనసులను గెలుచుకుంటుందని చిత్ర యూనిట్ ప్రమోషన్ బాగానే చేస్తోంది.

హీరో, హీరోయిన్ కు హిట్ వచ్చినట్లేనా?

ఈ సినిమాకు కథ కథనం సంభాషణలు హీరో కిరణ్ సమకూర్చడం విశేషం. శ్రీధర్ గాదే దర్శకత్వం వహించిన ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమా అనంతరం కిరణ్ అబ్బవరం మరి కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలతో వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. తెలుగు హీరోయిన్ అయినటువంటి ప్రియాంక జవాల్కర్ చాలా రోజులకు కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది. ఈ సినిమాతో అమ్మడికి కాస్త మంచి పేరు దక్కిందని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here