RRR రిలీజ్.. తారక్ బర్త్ డే రోజు కొత్త తేదీ చెబుతారట

0
20

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `ఆర్.ఆర్.ఆర్` రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.  కరోనా రంగ ప్రవేశం పాన్ ఇండియా సినిమాని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. 80శాతం చిత్రీకరణ పూర్తయిందని చెబుతున్నా.. పెండింగ్ పనులు అవ్వక  టెక్నికల్ వర్క్స్ కూడా చేయలేని పరిస్థితి. వాస్తవానికి అన్నీ అనుకున్నట్లు సాగితే అక్టోబర్ లో దసరాని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

కానీ కొవిడ్ -19 సెకెండ్ వేవ్ ఉధృతితో రిలీజ్ సాధ్యం కాదని తేలిపోయింది. షూటింగ్ సహా ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. థియేటర్లు సైతం మూత పడి ఉన్నాయి. అవి ఎప్పుడు తెరుచుకుంటాయో  కూడా క్లారిటీ లేదు. దీంతో రాజమౌళి అండ్ టీమ్ సినిమా రిలీజ్ ను తాత్కాలికంగా వాయిదా వేసుకుని కొత్త తేది ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ చేశారని తెలిసింది.

ఈనెల 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కొత్త రిలీజ్ తేదీని ప్రకటించాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నారట. 2022 లోనే రిలీజ్ ఉంటుందని రిలీజ్ తేది ఫిక్స్ చేసే ప్లాన్ లో ఉన్నారని తెలుస్తోంది. ఈ ఏడాది రిలీజ్ లేదు కాబట్టి..ప్రస్తుత పరిస్థితులు..భవిష్యత్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని  కాలానుగుణంగా ప్రకటించే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ టీమ్ సభ్యులు కొందరు కొవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. తొలి వేవ్ లో రామ్ చరణ్ కొవిడ్ బారిన పడగా..సెకెండ్ వేవ్ లో జూనియర్ ఎన్టీఆర్ కు  వైరస్ సోకింది. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో  ఉంటూ చికిత్స  తీసుకుంటోన్న సంగతి తెలిసిందే.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here