RRR టీజర్ కంటే ముందే మరో వీడియో: వాళ్లిద్దరి కోసం స్పెషల్గా.. ట్రీట్ రెడీ చేస్తున్న జక్కన్న

0
9

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఎంతో ఉన్నతంగా తెరకెక్కుతోన్న చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. ఆరంభం నుంచే అంచనాలు ఏర్పరచుకోన్న ఈ మూవీపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో దీని నుంచి అదిరిపోయే కానుక రాబోతుందని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. హీరోలిద్దరి కోసం స్పెషల్‌గా ఆ వీడియోను జక్కన్న రెడీ చేస్తున్నాడట.

అల్లూరి, భీంలా మారిన తెలుగు స్టార్లు

తెలుగు గడ్డపై స్వాతంత్య్రం కోసం పోరాటం చేసి.. వీర మరణం పొందిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీం చరిత్రల ఆధారంగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ భారీ చిత్రానికి కీరవాణి సంగీతం ఇస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్, హీరోయిన్లు. ఇందులో తారక్.. భీంగా, చరణ్.. అల్లూరిగా నటిస్తోన్న సంగతి విధితమే.

ఎప్పుడో మొదలైనా… బ్యాలెన్స్ ఉంది

అత్యంత భారీ బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో రూపొందుతోన్న RRR మూవీ షూటింగ్ మూడేళ్ల క్రితమే మొదలైంది. అయినప్పటికి సినిమాకు సంబంధించిన చిత్రీకరణ భాగం మాత్రం ఇంకా బ్యాలెన్స్ ఉండిపోయింది. దీనికి కరోనా లాక్‌డౌన్‌తో పాటు పలు రకాల ఆటంకాలు ఎదురవడమే ప్రధానం కారణం. ఈ కారణంగానే ఈ సినిమా రెండుసార్లు అనుకున్న తేదీకి విడుదల కాలేదు.

ఈ సారి రిలీజ్ ఫిక్స్… అందుకే ప్లానింగ్

RRR మూవీ 2020లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, షూటింగ్ పూర్తి కాని కారణంగా అది సాధ్యపడలేదు. దీని తర్వాత 2021 జనవరి 8కి విడుదల చేస్తున్నట్లు ప్రకటించినా షూట్ కంప్లీట్ కాలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను అక్టోబర్ 13, 2021న రిలీజ్ చేస్తామని వెల్లడించారు. అందుకు అనుగుణంగానే దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పక్కా ప్లానింగ్‌తో చేస్తున్నారు.

ఆ రెండింటికీ ప్లాన్.. రెడీ చేస్తున్నారుగా

అప్పుడెప్పుడో మొదలైన RRR మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తైంది. రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తైందని.. ఇద్దరు హీరోలు రెండు భాషలకు డబ్బింగ్ కూడా చెప్పేశారని యూనిట్ ఇటీవలే అధికారికంగా వెల్లడించారు. అందులో ఓ పాట కోసం ఎన్టీఆర్.. ఒలీవియా ఉక్రెయిన్ వెళ్లనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో హీరోలిద్దరితో పాటు ఆలియా భట్‌తో మరో పాట తీస్తారు.

RRR టీజర్ కంటే ముందే మరో వీడియో

ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న RRR మూవీ కోసం దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే దీని నుంచి వచ్చే అప్‌డేట్ల గురించి వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో RRR మూవీ టీజర్ స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 15న రానుందని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం.. దాని కంటే ముందే మరో వీడియో వస్తుందట.

వాళ్లిద్దరి కోసం స్పెషల్‌‌గా.. జక్కన్న ప్లాన్

భారీ చిత్రం RRR నుంచి ఇప్పటికే పలు పోస్టర్లు, వీడియోలు విడుదలయ్యాయి. అన్నింటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక, ఇప్పుడు స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆగస్టు 1న ఎన్టీఆర్, చరణ్ గురించి ఓ వీడియో రాబోతుందని తాజాగా తెలిసింది. ఇందుకోసం రాజమౌళి ఎడిటింగ్ వర్క్‌ను కూడా మొదలెట్టాడట. స్నేహం విలువను చెప్పేలా ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here