RAPO19: రామ్ పోతినేని సినిమాకు సాలీడ్ ఆఫర్.. రాక్ స్టార్ వల్ల అప్పుడే కోట్ల రూపాయల ఆదాయం

0
15

యువ హీరో రామ్ పోతినేని కెరీర్ మరో యూ టర్న్ తీసుకునే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం స్టార్స్ అందరూ కూడా పాన్ ఇండియా అంటూ కొత్త తరహా ప్రయోగాలు చేస్తున్నారు. రామ్ పోతినేని ఆ లెవెల్లో కాకపోయినా కూడా బైలాంగ్యువల్ అంటూ తనదైన శైలిలో స్థాయిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి స్టార్టింగ్ లోనే మంచి బజ్ అయితే క్రియేట్ చేశాడు.

మరో లెవెల్ కు తీసుకు వెళ్లాలని

రామ్ పోతినేని ఈ ఏడాది మొదట్లో రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో వచ్చిన క్రేజ్ ను మరో లెవెల్ కు తీసుకు వెళ్లాలని చాలా ప్రయత్నాలు చేశాడు గాని వర్కౌట్ కాలేదు. ఇక నెక్స్ట్ సినిమాతో మాత్రం అంతకుమించి అనేలా హిట్ కొట్టాలని డిసైడ్ అయ్యాడు.

ఎంతో నమ్మకంతో..

రామ్ పోతినేనికి ఎన్నో ఆఫర్స్ వచ్చినప్పటికీ అతను ఎంతో నమ్మకంతో లింగుస్వామికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కథ చర్చల సమయంలోనే దర్శకుడిపై సగం నమ్మకం ఉంచిన రామ్ ఫుల్ స్క్రిప్ట్ చెప్పిన తరువాత మరింత కాన్ఫిడెన్స్ వచ్చిందట. సినిమా కథ స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉందని ద్విభాషా సినిమాగా చేయాలని డిసైడ్ అయ్యాడు.

లింగుస్వామి హిట్టు కొట్టి చాలా కాలం అయ్యింది

అయితే లింగుస్వామి హిట్టు కొట్టి చాలా కాలం అయ్యింది. పందెంకోడి – ఆవారా అంటూ అప్పట్లో తెలుగు తమిళ్ లో బాక్సాఫీస్ హిట్స్ అందుకున్నాడు. ఇక ఆ తరువాత సూర్య వంటి స్టార్స్ తో సినిమాలు చేసినప్పటికీ వర్కౌట్ కాలేదు. పందెం కోడి సీక్వెల్ కూడా అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో అగ్ర హీరోలు అతనితో సినిమాలు చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు.

పదేళ్ల క్రితమే లింగుస్వామి – అల్లు అర్జున్

ఇక రామ్ పోతినేనితో లింగుస్వామికి ఎప్పటి నుంచో మంచి పరిచయం ఉంది. అసలైతే పదేళ్ల క్రితమే లింగుస్వామి అల్లు అర్జున్ తో ద్విభాషా సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ వర్కౌట్ కాలేదు. ఇక RAPO 19వ ప్రాజెక్ట్ సెట్టవ్వడంతో బాక్సాఫీస్ వద్ద తన అసలైన సత్తా చాటాలని అనుకుంటున్నాడు.

భారీ ధరకు అమ్ముడైన ఆడియో హక్కులు

ఇక ఈ సినిమాకు బజ్ గట్టిగానే ఉన్నట్లు ఒక వార్తతో క్లారిటీ వచ్చేసింది. సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే సినిమా ఆడియో హక్కులను 2.75కోట్లకు ఆదిత్య మ్యూజిక్ కంపెనీ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రాక్ స్టార్ డిఎస్పీ అనగానే ఈ సినిమా మ్యూజిక్ పై ఒక్కసారిగా బజ్ క్రియేట్ అయ్యింది.

మ్యూజికల్ హిట్స్..

గతంలో రామ్ – దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు మంచి మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. జగడం నుంచి హలో గురు ప్రేమ కోసమే వరకు మొత్తం ఆరు సినిమాలు వచ్చాయి. దాదాపు అన్ని సినిమాల పాటలు బెస్ట్ మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు రాబోతున్న RAPO19 ప్రాజెక్ట్ కు రాక్ స్టార్ ఏ స్థాయిలో మ్యూజిక్ అందిస్తాడో చూడాలి.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here