Jr NTR పాలిట విలన్గా యంగ్ హీరో: దెబ్బకొట్టేందుకు డైరెక్టర్ ప్లాన్.. పాన్ ఇండియా కోసమే ఇలా!

0
7

వరుస విజయాలను అందుకుంటూ ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఒకదాని తర్వాత ఒకటి ఇలా వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఫలితంగా బడా డైరెక్టర్లతో చేతులు కలుపుతూ టాలీవుడ్‌లో క్రేజీ లైనప్‌ను సెట్ చేసుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పాలిట విలన్‌గా మారబోతున్నాడట. దీని వెనుక ఓ బడా డైరెక్టర్ చేసిన ప్లాన్ ఉందని తెలుస్తోంది.

ప్రతిష్టాత్మక చిత్రంలో రియల్ హీరోగా

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్.. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న RRR (రౌద్రం రణం రుధిరం)లో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇందులో చరణ్ అల్లూరిలా, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలను చేస్తున్నారు.

అతడిని కాదని.. మరొక దర్శకుడితో

RRR మూవీ పట్టాలపై ఉన్న సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్.. త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. ఇది జరిగిన చాలా రోజులకు షూటింగ్ ప్రారంభం అవకపోగా.. ఆ ప్రాజెక్టు ఆగిపోయిందని మరో ప్రకటన వెలువడింది. దీంతో క్రేజీ కాంబినేషన్‌కు మధ్యలోనే బ్రేక్ పడిపోయింది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్.. కొరటాల శివతో సినిమా చేస్తున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే.

ఇది కూడా అదే రేంజ్‌లో రాబోతుంది

‘జనతా గ్యారేజ్’ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యూనివర్శల్ కాన్సెప్టుతో పాన్ ఇండియా రేంజ్‌తో రాబోతుంది. ఇందులో హీరోయిన్‌గా కియారా అద్వాణీని తీసుకుంటున్నారని అంటున్నారు. ఇది త్వరలోనే మొదలవనుంది.

కథ గురించి పుకార్లు… ఇదే నేపథ్యం

కొరటాల శివతో ఎన్టీఆర్ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి దీని గురించి ఎన్నో ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా కథ గురించి ఎన్నో రకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇది పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతుందని అంటున్నారు. పల్లెటూరి నుంచి వచ్చిన యువకుడు దేశ రాజకీయాలను శాసించేలా ఎదగడమే దీని నేపథ్యం అని టాక్.

ఎన్టీఆర్ పాలిట విలన్‌గా యంగ్ హీరో

ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తోన్న RRR మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తైంది. దీంతో కొరటాల శివ మూవీ త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇందులో మరో యంగ్ హీరో కూడా భాగం కాబోతున్నాడని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఇందులో సదరు హీరో విలన్‌గా నటిస్తున్నాడట. అతడెవరనేది త్వరలోనే ప్రకటించబోతున్నారని సమాచారం.

పాన్ ఇండియా కోసం దర్శకుడు ప్లాన్

ఎన్టీఆర్‌తో చేసే ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌తో తెరకెక్కించబోతున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ పొలిటీషియన్ కమ్ విలన్ పాత్రలో వేరే ఇండస్ట్రీకి చెందిన మార్కెట్ ఉన్న హీరోను తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. ఇందుకోసం ఇప్పటికే పలువురి పేర్లను కూడా పరిశీలించారని తెలుస్తోంది. హీరోను దెబ్బకొట్టే ఈ పాత్ర ఎంతో ప్రాధాన్యాన్ని కలిగి ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here