Evaru Meelo Koteeswarulu ఫస్ట్ గెస్ట్ పేరు లీక్: ఎన్టీఆర్తో సందడి చేయనున్న టాలీవుడ్ స్టార్ హీరో

0
15

తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల షోలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ కొన్నింటికి మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తుంది. అలాంటి వాటిలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో ఒకటి. చాలా ఏళ్లుగా హిందీలో ప్రసారం అవుతోన్న ‘కౌన్ బనేగా కరోడ్ పతీ’ షో ఆధారంగా వచ్చిన దీనికి తెలుగులోనూ మంచి ఆదరణ లభించింది. ఇక, త్వరలోనే ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ పేరుతో మరో సీజన్ ప్రారంభం కాబోతుంది. దీన్ని జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయనున్నాడు. తాజాగా ఈ షోకు వచ్చే ఫస్ట్ గెస్ట్ వివరాలు బయటకు వచ్చాయి.

ఇద్దరు స్టార్ హీరోలతో నాలుగు సీజన్లు

సామాన్యులను కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో మొదలైన షోనే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఇది.. ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇందులో మొదటి మూడింటినీ అక్కినేని నాగార్జున.. నాలుగో దాన్ని మాత్రం మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేశారు. ఇవన్నీ ఒకదానికి మించి ఒకటి సక్సెస్‌ఫుల్‌గా రన్ అయ్యాయి.

ఐదో సీజన్ సరికొత్తగా…

ఈ సారి ఇలా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకు విజయం సాధించినా.. నాలుగు సీజన్లు పూర్తైన తర్వాత ఎందుకనో దీన్ని మళ్లీ ప్రసారం చేయలేదు. ఈ నేపథ్యంలో చాలా గ్యాప్ తర్వాత ఈ షోను తీసుకొస్తున్నారు. అయితే, ఈ సారి దీనికి ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అని టైటిల్ మార్చారు. అంతేకాదు, ఈ సారి ఈ షోను స్టార్ మాలో కాకుండా జెమినీ టీవీలో ప్రసారం చేయబోతున్నారు.

ప్రోమో విడుదల.. ప్రారంభం కాలేదుగా

ప్రేక్షకులు మెచ్చిన షోగా ప్రసారం కాబోతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ప్రోమోను ఆ మధ్య విడుదల చేశారు. ‘మీ జీవితాలని మార్చే గేమ్ షో.. మీ ఆశలని నిజం చేసే గేమ్ షో ‘‘ఎవరు మీలో కోటీశ్వరులు” త్వరలో మీ జెమినీ టీవీలో రాబోతుంది సిద్ధంగా ఉండండి’ అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అయితే, ఆ తర్వాత కరోనా సెకెండ్ వేవ్ రావడంతో దీన్ని ప్రారంభించలేదు.

షూటింగ్ ప్రారంభం.. రంగంలోకి తారక్

ఈ షోను గతంలో అక్కినేని నాగార్జున, చిరంజీవి నడిపించగా.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్నాడు. ఇప్పటికే బిగ్ బాస్ షోను సక్సెస్‌ఫుల్‌ చేసిన అతడు.. ఇప్పుడు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ను కూడా అదే రీతిలో నడిపించేందుక రెడీ అవుతున్నాడు. పరిచయ ప్రోమోలో తన పేరు రామారావు అని చెప్పి షోపై అంచనాలు పెంచేశాడు తారక్. ఇటీవలే షూట్‌లో పాల్గొన్నాడు.

పది ఎపిసోడ్‌లకు ఒక్కసారి ప్లాన్ చేసి

కరోనా సమయంలోనూ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకు సంబంధించిన కంటెంస్టెంట్ల ఎంపిక ప్రక్రియను కొనసాగించారు. ఈ క్రమంలోనే షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. ఎన్టీఆర్ కూడా లుక్ టెస్టులో పాల్గొన్నాడు. ఇక, త్వరలోనే పూర్తి స్థాయిలో షో కోసం షూట్‌కు రాబోతున్నాడు. పది ఎపిసోడ్లకు ఒకసారి షూట్ జరగనుందట. ఇందుకోసం తారక్ ప్లాన్ చేసుకున్నాడని తెలుస్తోంది.

ఎన్టీఆర్ షోకు వచ్చే ఫస్ట్ గెస్ట్ పేరు లీక్

‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోను వీలైనంత త్వరగా అంటే ఆగస్టులోనే ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పటికే షూటింగ్ మినహా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసేశారని అంటున్నారు. ఇక, ప్రస్తుతానికి ఈ షోకు తారక్ డేట్స్ కూడా ఇచ్చేశాడనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ షోకు వచ్చే మొట్టమొదటి గెస్టు గురించిన వివరాలు బయటకు వచ్చాయి.

ఎన్టీఆర్‌తో సందడి చేయనున్న స్టార్ హీరో

తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. త్వరలోనే ప్రారంభం కాబోతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫస్ట్ గెస్టుగా రాబోతున్నాడట. దీనికి సంబంధించిన షూటింగ్‌ను కూడా ఈ రెండు మూడు రోజుల్లోనే జరపనున్నారని తెలుస్తోంది. అంతేకాదు, ఆ వెంటనే ఈ ప్రోమోను విడుదల చేసి.. షోను గ్రాండ్‌గా మొదలు పెడతారనే టాక్ బాగా వినిపిస్తోంది.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here